English | Telugu
యష్.. వేదల పెళ్లికి మాళవిక అడ్డుపడుతుందా?
Updated : Feb 3, 2022
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. బేబీ మిన్ను, బెంగళూరు పద్మ, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, శ్రీధర్ జీడిగుంట కీలక పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. పెల్లి కాని ఓ యువతి.. తల్లిదండ్రులు వున్నా వారి ప్రేమ లభించక తల్లి ప్రేమ కోసం ఎదురుచూస్తున్న ఓ పాప.. ఈ ఇద్దరి నేపథ్యంలో సాగుతున్న కథగా ఈ సీరియల్ ని రూపొందించారు.
ఖుషీ తనకు దక్కాలంటే డా. వేదని పెళ్లి చేసుకోక తప్పదని గ్రహించిన యష్ తనతో పెళ్లికి సిద్ధమవుతాడన్నది తెలిసిందే. వేద కూడా ఖుషీ కోసం యష్ ని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది. ఇంట్లో వాళ్లు తమ పెళ్లికి అంగీకరించరని భావించిన యష్, వేద రిజిస్టర్ మ్యారేజ్ కోసం రిజిస్టర్ ఆఫీస్‌కి వెళతారు.. అక్కడ ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు మొదలవుతాయి. వీరిని గమనించిన యష్ మాజీ భార్య మాళవిక ఏం జరుగుతోందని ఆరా తీయడం మొదలుపెడుతుంది. కట్ చేస్తే యష్, వేద రిజిస్టర్ మ్యారేజ్ ప్రయత్నాలన వద్దని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందామని ఇంటికి తిరిగి పయనమవుతారు.
కట్ చేస్తే.. వేద ఫ్యామిలీ.. యష్ ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంటారు. అయితే తాము మగ పెళ్లివారమని యష్ తల్లి మాలిని పోజు కొడుతూ వేద తల్లిని ఆడుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాదులాట మొదలవుతుంది. ఈ ఇద్దరి వల్ల వేద - యష్ ల పెళ్లి జరిగేలా లేదని మాలిని భర్త రత్నం, వేద తండ్రి భయపడుతుంటారు..ఇంతలో ఇంటికి చేరుకున్న యష్ , వేద అది గమనించి ఇంట్లోకి వస్తారు... ఎదురుగా వేద తల్లి సులోచన, యష్ తల్లి మాలిని గొడవపడుతుండటం చూసి అంతా అయిపోయింది అని యష్, వేద టెన్షన్ పడుతుంటారు..
Also Read:స్టోర్ రూమ్ లో బందీగా మలబార్ మాలిని!
ఇంతలో వారిని సర్ ప్రైజ్ చేస్తే పూల వర్షం కురుస్తుంది. అంతా ప్లాన్ చేసి ఇలా చేశామని మాలిని, సులోచన చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. వీరి పెళ్లి గురించి మాళవిక, అభిమన్యులకు తెలిసిందా? .. తెలిస్తే వారు ఎలాంటి అడ్డంకులు సృష్టించబోతున్నారు? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.