English | Telugu
యష్మీ సుత్తేనంట.. తేల్చిసిన వైల్ట్ కార్డ్ కంటెస్టెంట్స్!
Updated : Oct 7, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో ప్రతి ఒక్కరి దృష్టి తనవైపుకి తిప్పుకుంది యష్మీ. ఈ అమ్మడు ప్రతీ దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతు నెగెటివిని ఎక్కువగా తెచ్చేసుకుంటుంది. చెప్పాలంటే అక్కడ మ్యాటర్ ఏముండదు కేవలం స్క్రీన్ స్పేస్ కోసమేనని తెలిసిపోతుంది. కానీ యష్మీ తనకి తను గేమ్ బాగా ఆడినట్లు తెగ ఫీల్ అవుతుంది. అంతే కాకుండా నిఖిల్ పృథ్వీలని ఇన్ ఫ్లూయెన్స్ చేస్తుంది. ఆ మాట అంటే ఒప్పుకోని సోనియాని ఆడియన్స్ పట్టుబట్టి బయటకు పంపించారు. అంటే పృథ్వి, నిఖిల్ లని కచ్చితంగా ఎవరో ఒకరు ఇన్ ఫ్లూయెన్స్ చెయ్యాలన్నమాట అందుకే ఇప్పుడు సోనియా ప్లేస్ లోకి యష్మీ వచ్చిందనే చెప్పాలి.
హౌస్ అంత కూడా యష్మీ హైపర్ యాక్టివ్ అనే అనుకుంటున్నారు. అది కేవలం నామినేషన్ లో గట్టిగా అరుస్తూ మాట్లాడడం మాత్రమే చూస్తారా అందుకే అలా అనుకుంటారు. ఇప్పుడు బయట నుండి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వారు.. హౌస్ లో ఉన్నా వారి గేమ్ ఇంక వారి పాజిటివ్, నెగెటివ్ మొత్తం తెలుసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు హౌస్ మేట్స్ గురించి చెప్పే విషయాలు మాత్రమే కీలకం.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారిని నాగార్జున ఒకే క్వశ్చన్ అడిగాడు. హౌస్ లో సుత్తి ఎవరు? కత్తి ఎవరు అని అడిగాడు. అయితే ఎనిమిది మందిలో ఒక్కరు తప్ప అందరు కూడా సుత్తి యష్మీ అని చెప్పారు.
అసలు యష్మీ గేమ్ ఆడదా అని నాగార్జున అడుగగా.. లేదు ఓవర్ ఎక్సైట్మెంట్ తప్ప ఏముండదు.. అనవసరంగా మాట్లాడుతుంది.. చిన్న విషయన్ని పెద్దది చేస్తోందనే చెప్పుకొచ్చారు. అలా చెప్పిన వాళ్ళు అందరూ మళ్ళీ హౌస్ లో యష్మీతో పాటే ఉండాలి అంటే.. యష్మీ వీక్ నెస్ ని క్యాచ్ చేసుకొని తమ గేమ్ ప్లాన్ చేసుకుంటారని క్లియర్ గా అర్ధమవుతుంది. మరి నిఖిల్, పృథ్వీలని అడ్డుగా పెట్టుకొని యష్మీ చేస్తున్న నామినేషన్లని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి.