English | Telugu

నీకు ఫ్యామిలీ లేదేమో నాకు ఉందంటూ విష్ణుప్రియపై నోరుజారిన సోనియా!

బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్ ల హవా సాగింది‌. ఇందులో కిర్రాక్ సీత, సోనియా మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరుగగా.. శేఖర్ బాషాకు ఆదిత్య ఓం కి మధ్య కోల్డ్ వార్ సాగింది. ఇక ప్రతీది పాయింట్ టూ పాయింట్ మాట్లాడే అభయ్ నవీన్ మొదటిసారి రాంగ్ పర్సన్ ని నామినేట్ చేసాడని, తను చెప్పిన రీజన్ కూడా వ్యాలిడ్ లేదని స్పష్టమవుతుంది.

ఆదిత్య ఓం ఎమోషనల్ అయ్యాడు. మన పర్ స్పెక్టివ్ సెంటిమెంట్ స్టార్ మణికంఠ ఎప్పటిలాగే ల్యాగ్ నామినేషన్ చేయగా.. ప్రేరణ, కిర్రాక్ సీత మధ్య ఇంకా ఆ చెత్తబుట్ట టాపిక్కే సాగుతుంది. ఇంకా హౌస్ లో నామినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే విష్ణుప్రియ మాట్లాడిన ప్రతీది వ్యాలిడ్ అనిపించింది‌. కానీ సోనియా ఆకుల నోరుజారింది. అసలేం జరిగిందంటే సోనియాను విష్ణుప్రియ నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ జరిగిన నిఖిల్ ఇష్యూ గురించి రెయిజ్ చేస్తూ నేను అన్న దానికి సారీ చెప్పా.. కానీ నాపైన అడల్ట్రీ అనే ముద్ర వేశారు మీరు.. దానికి నాకు సారీ చెప్పలేదంటూ విష్ణుప్రియ అడిగింది. నీకు అది కామెడీ ఏమో కానీ నాకు కాదు.. మన ఇద్దరి మధ్య ఆ ర్యాపో లేదు.. నాకు అది అడల్ట్రీనే అంటూ సోనియా చెప్పింది. అసలు మీ దృష్టిలో నేను ఏం అడల్ట్రీ (18 ప్లస్) జోక్స్ వేశా అంటూ విష్ణుప్రియ అడిగితే.. మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేంత గొప్పదాన్ని కాదని‌ సోనియా అంది. మీరు ఒకళ్లే తెలివైనోళ్లు కాదు.. పిల్ల బచ్చా జోకులేసుకునే దాన్ని అడల్ట్రీ అని ఎట్లా అంటారంటూ విష్ణుప్రియ అనేసరికి బరాబర్ ఇప్పుడు కూడా అంటా అంటు మరోసారి సోనియా అదే మాట అంది.

నీకు ఫ్యామిలీ లేదేమో నాకు ఉంది. నన్ను చూస్తారంటూ విష్ణుప్రియని హేళన చేసింది సోనియా. ఇక ఈ మాటలని ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ విష్ణుప్రియ పేరుతో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. నామినేషన్ కరెక్ట్ పాయింట్ మాట్లాడిన విష్ణుప్రియని ఇలా నోటికొచ్చినట్టు మాట్లడటమేంటని సోనియాపై మండిపడుతున్నారు నెటిజన్లు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...