English | Telugu

విజయ్ బిన్నీ మాష్టర్ నెక్స్ట్ మూవీలో ఢీ నుంచి ముగ్గురికి అవకాశం

ఢీ 20 ప్రతీ వారం ఎపిసోడ్స్ లో ఏదో ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ఉంటూనే ఉంది. ఇక ఈ వారం టాపిక్ లో కూడా అలాగే ఒక విషయం ఉంది. హోస్ట్ నందు కంటెస్టెంట్ మణికంఠ మాష్టర్ తో కలిసి "బోనం ఎత్తి బయలెల్లు" అనే సాంగ్ కి మంచి జోష్ తో నాటు స్టెప్స్ వేసాడు. దాంతో కంటెస్టెంట్స్ జడ్జెస్ అంతా ఫిదా ఇపోయారు. వెంటనే ఆది ఒక రిక్వెస్ట్ చేసాడు. "తెలుగు సినిమా డైరెక్టర్స్ అందరికీ...మా ఢీ షో తరపు నుంచి చిన్న రిక్వెస్ట్. నందు బ్రోకి ఒక పెద్ద అవకాశం ఇవ్వండి.

ఆ సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే మనోడి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు..అలాంటి ఒక పెద్ద అవకాశం కోసం నందు బ్రో ఎంత వెయిట్ చేస్తున్నాడో అతని తమ్ముడి లాంటి వాడిని నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నా." అని చెప్పాడు. దాంతో నందు ఆదిని ముద్దు పెట్టుకుని లవ్ యు ఆది. ఇక దీపికా లేచి "నందు గారు మీతో హీరోయిన్ గా నటించడానికి నేను రెడీగా ఉన్నాను" అని చెప్పింది. ఇక విజయ్ బిన్నీ మాష్టర్ లేచి "మణికంఠ పక్కన చేయడం అంత ఈజీ కాదు కానీ మీరు చాలా బాగా చేశారు" అంటూ నందుని పొగిడారు. "ఆది గారు మీరు నందు బ్రో కోసం రిక్వెస్ట్ చేశారు డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి. బట్ నేను డైరెక్టర్ గా చెప్తున్నాను నేను ఈ ఢీషో నుంచి నా నెక్స్ట్ మూవీలో ఒకరికి కోరియోగ్రఫీ అవకాశం అలాగే ఇంకో ఇద్దరికీ యాక్టింగ్ అవకాశం ఇస్తాను. నెక్స్ట్ రాబోతున్న పెద్ద సినిమాలోకి ఎవరిని తీసుకోబోతున్నానో ఫినాలే రోజున అనౌన్స్ చేస్తాను" అని చెప్పారు. "ఈ అనౌన్స్మెంట్ తో మరింత కిక్ ని, ఎనర్జీని నిమ్పరారు. మీరు ఇచ్చిన ఈ ఫినాలే అనౌన్స్మెంట్ వలన వీళ్లంతా ఫినాలే వరకు రావడానికి గట్టిగా ట్రై చేస్తారు." అన్నారు ఆది, నందు.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.