English | Telugu
హ్యంగోవర్ లో వేద.. ఆడుకుంటున్న యష్
Updated : Apr 26, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ మంచి రేటింగ్ తో విజయవంతంగా కొనసాగుతోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, ఆనంద్, మిన్ను నైనిక, ప్రణయ్ హనుమండ్ల తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మంచి ఆదరణతో సాగుతోంది.
వేద పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీ కి సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్న యష్ ప్లాన్ బెడిసికొడుతుంది. వేద తండ్రికి మందు బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చి తన దృష్టిలో మంచి అల్లుడు అనిపించుకోవాలని ప్లాన్ చేస్తాడు. అయితే అది కాస్తా బెడిసికొట్టి వేద ఆ బాటిలో వున్న మందు తాగేసి రచ్చ రచ్చ చేస్తుంది. మైకం కమ్మడంతో తల్లి సులోచనతో పాటు ఆత్త మాలబార్ మాళినితోనూ హద్దులు దాటి ప్రవర్తిస్తుంది. దీంతో వేదని బాత్రూమ్ కి తీసుకెళ్లి షవర్ కింద నిలబెడతాడు యష్ ..
కట్ చేస్తే ఈ విసయంలో యష్ ని అతని తమ్ముడు ఆనంద్ నిలదీస్తాడు. ఎంతో డిగ్నిటిగా వుండే వదిన నీ వల్ల ఈ రోజు ఇలా అందరి ముందు అవమాన పడిందని, నువ్వు మందు కలిపి ఇవ్వడం వల్లే ఇదంతా జరిగిందని అసహనం వ్యక్తం చేస్తాడు. ఈ మాటలు విన్న వేద ఆగ్రహంతో ఊగిపోతుంది. ఎంత తప్పుచేశానని కుమిలిపోతూనే యష్ చేసిన పనికి అతనికి బుద్ధి చెప్పాలని వెంటనే బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి యష్ చెంప పగలగొడుతుంది.
దీంతో యష్ అహం దెబ్బతింగుంది. ఇంత వరకు తనని ఎవరు ఇలా కొట్టలేదని, తనని ఇలా కొట్టిన ఫస్ట్ అండ్ లాస్ట్ ఉమెన్ నువ్వేనని రగిలిపోతాడు. మత్తులో వున్న వేద వెళ్లి పడుకుంటుంది. తెల్లారినా లేవకపోవడంతో యష్ టెడ్డీ బేర్ తో వేదని కొట్టి లేస్తుందోమోనని దాక్కుంటాడు. వేద లేవగానే ఏమీ తెలియనట్టే గదిలోకి వచ్చి షెల్ఫ్ ఓపెన్ చేసి ఏదో వెతికినట్టుగా చూస్తుంటాడు. వేద నన్ను ఎవరు కొట్టారు .. అబ్బా తలపగిలిపోతోంది అంటూ అరుస్తుంది. దీంతో నిమ్మరసం తాగు దిగుతుంది అని చెబుతాడు యష్. ఆ తరువాత ఏం జరిగింది? .. అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.