English | Telugu
ఫ్యామిలీ సపోర్ట్ తో యష్ ని ఓ ఆట ఆడుకున్న వేద
Updated : Mar 31, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మలబంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్, అనంద్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ పాప పాత్ర ప్రధానంగా సాగుతున్న ఈ సీరియల్ ప్రతీ వారం ఆసక్తికర మలుపులతో ఆద్యంతం అలరిస్తోంది. ఈ గురువారం మరింత ఆసక్తిగా సాగబోతోంది. వేదఅత్తారింట్లో వుండటంతో ఆమె తండ్రి వేద గురించి ఆలోచిస్తూ బాల్కనీలోకి వస్తారు.
అప్పుడే బాల్కనీలోకి వచ్చిన వేద తన కోసం బాధపడుతున్న తల్లిదండ్రులని చూసి వారిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ తరువాత ఇంట్లోకి వెళ్లి తన తల్లి సులోచన పెట్టిన ఫిల్టర్ కాఫీ తాగుతుంది. ఈ లోగా చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి ఉత్తర డాక్టర్ గా ఈ ఏడాది మా చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి మిమ్మల్ని ఎంపిక చేశామని చెబుతాడు. ఆ విషయం విని వేదతో పాటు ఇంటి సభ్యులంతా ఆనందపడతారు.
ఈ విషయాన్ని అల్లుడు యష్ కు తెలియజేయమని వేదని ఫోన్ చేయమంటారు. అదే టైమ్ లో స్టాఫ్ చేసిన పనికి చెర్రెత్తుకొచ్చిన యష్ వారిపై కేకలు వేస్తుంటాడు. ఫోన్ మోగడంతో అదే చిరాకులో వేదపై కూడా అరిఏస్తాడు. నీలాంటి పిచ్చిదానికి ఉత్తమ డాక్టర్ అవార్డ్ ఇచ్చిన పిచ్చి వాళ్లెవరు? అంటూ వేదని ఆటపట్టిస్తాడు. దీంతో తన వాళ్లు తెలియకుండానే యష్ తో నైస్ గా మాట్లాడి జూబ్లీ ఫంక్షన్ హాల్ లో ఫంక్షన్ వుంది రావాలి అని చెబుతుంది. నేను రానని చెబుతుంటే నీకు మెంటలా ? అని యష్ అరిచేస్తాడు. అయినా సరే వేద తనకు ఎక్కడలేని కోపం వస్తున్నా.. తల్లిదండ్రుల ముందు ఎక్కడ దెలిసిపోతుందోనని జాగ్రత్తపడుతూ యష్ కి మళ్లీ చెబుతుంది. మీరు వస్తున్నారు అంతే అని ఫోన్ పెట్టేస్తుంది. దీంతో నేను సీరియస్ అవుతుంటే తనేంటి ఇంత కూల్ గా మాట్లాడుతోందని యష్ కి ఏమీ అర్థం కాదు.
ఆ తరువాత మాలిని ఇంట్లో కూడా విషయం తెలిసిపోవడంతో ఆ విషయాన్ని చెప్పాలని యష్ తండ్రి ఫోన్ చేసి విషయం చెబుతాడు. వెంటనే ఆ పిచ్చిదానికి అవార్డ్ ఇచ్చింది ఎవరంటాడు యష్ .. ఇదంతా స్పీకర్ ఆన్ చేయడంతో వేదతో పాటు వేద తల్లిదండ్రులు, మాళిని కూడా వింటుంది. ఇంత మాటన్నాడేంటీ? అని వేద తల్లిదండ్రులకంటే ఎక్కువగా యష్ తల్లిదండ్రులు యష్ పై గుర్రుగా వుంటారు. ఇక ఇంటికి వచ్చిన యష్ కు చుక్కలు చూపిస్తారు. ఎవరిని పలకరించినా పిచ్చి వాళ్లం, పిచ్చి మాలోకం అంటూ సెటైర్లు వేస్తారు. ఇదంతా వేద చేసిన ప్లాన్ అని యష్ ... వేదని నిలదీయాలని వెళతాడు.. ఆ తరువాత ఏం జరిగింది? .. యష్ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్లాడా? అక్కడ ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.