English | Telugu
Bigg boss 9 Telugu : తనూజ, భరణిలని విడదీసిన నాగార్జున.. ఇష్టమైనవి వదులుకున్నారా!
Updated : Oct 6, 2025
బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వారం వీకెండ్ సండే ఫన్ డే అంటు సాగింది. నాగార్జున గ్రాంఢ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక హౌస్ లోని కంటెస్టెంట్స్ కి స్టార్స్ ఇచ్చాడు నాగార్జున. హౌస్ లో ఇద్దరికి బ్లాక్ స్టార్.. ఒకరికి గోల్డ్ స్టార్.. మిగతా పది మందికి సిల్వర్ స్టార్ ఇచ్చాడు. ఈ సిల్వర్ స్టార్ ఇచ్చిన వారందరి ఆట మాములుగా ఉందని ఇద్దరు ఇద్దరూగా టాస్క్ పెట్టాడు నాగార్జున.
రాము, సుమన్ ఇద్దరు మొదటి నుండి సేఫ్ గా ఆడుతు ఏ విషయం అయిన చెప్పట్లేదని నాగార్జున అంటాడు. ఇద్దరికి హౌస్ లో ఉన్న నలుగురి నెగెటివ్ పాయింట్స్ చెప్పమంటాడు నాగార్జున. అయితే రాము బానే చెప్తాడు కానీ సుమన్ ఎవరిని హర్ట్ చేయకుండా సేఫ్ గా చెప్తాడు. ఆ తర్వాత రీతూ, సంజనకి గేమ్ పెడుతాడు. అందులో రీతూ గెలుస్తుంది. ఆ తర్వాత శ్రీజ, దివ్యకి కంటెస్టెంట్స్ ని ఇమిటేట్ చేసే టాస్క్ వస్తుంది. వాళ్ళ పర్ఫామెన్స్ పర్లేదు అన్నట్టే ఉంటుంది. హౌస్ లో బాండింగ్ ఎక్కువ అవుతున్నాయి. అలా అయితే ఆటపై ఫోకస్ చెయ్యలేరు. తనూజ, భరణి ఇద్దరు మాకు గేమ్ మాత్రమే ముఖ్యం అనుకొని ఇద్దరు ఒకరికి ఇష్టమైన వస్తువులు ఒకరు బ్రేక్ చెయ్యండి అని నాగార్జున చెప్తాడు.
భరణి వెళ్లి తనూజకి ఇష్టమైన వస్తువులు తీసుకొని వచ్చి బ్రేక్ చేస్తాడు. అలాగే తనూజ కూడా భరణికి ఇష్టమైన వస్తువులు బ్రేక్ చేస్తుంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ కి బ్రెయిన్ కి రిలేటెడ్ టాస్క్ లు పెడతారు. అందులో డీమాన్ విన్ అవుతాడు.