English | Telugu
స్టార్ మా పరివార్: దేవత vs రాఖీ పూర్ణిమ
Updated : May 29, 2022
ప్రతీ ఆదివారం `స్టార్ మా`లోని పాపులర్ టీవీ సీరియల్ నటీనటులతో యాంకర్ ఝాన్సీ నిర్వహిస్తున్న షో `స్టార్ మా పరివార్ లీగ్`. గత కొన్ని వారాలుగా సీరియల్ నటీనటులతో ఆసక్తికంగా సాగుతున్న ఈ షో ఈ ఆదివారం సెమీ ఫైనల్ కి చేరింది. ఈ సెమీస్ లో దేవత, రాఖీ పూర్ణిమ సీరియల్స్ నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నాయి. దేవత సీరియల్ నుంచి అర్జున్ అంబటి, సుహాసిని, కుమారి తో పాటు ఓ బాలనటి తో కలిసి మొత్తం నలుగురు హాజరయ్యారు.
రాఖీ పూర్ణిమ సీరియల్ నుంచి మధుబాబు, లిఖితా మూర్తి, సూరజ్, సుష్మిత మరో నటీ హజరయ్యారు. షో మధ్యలో టీవీ నటుడు అమర్ దీప్ చౌదరి రాఖీ భాయ్ లా సుత్తి పట్టుకుని ఎంట్రీ ఇచ్చి హంగామా చేశాడు. దేవత, రాఖీ పూర్ణిమ టీమ్ ల మధ్య ఓ రేంజ్ లో పోటీ జరిగింది. టీమ్ లీడర్ లుగా మధు బాబు, అర్జున్ అంబటిలని స్టేజ్ పైకి పిలిచిన యాంకర్ ఝూన్సీ మీమీ హీరోయిన్స్ ని కూడా తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం అని తెలిపింది. దీంతో అర్జున్ అక్కడ ముగ్గురున్నారు అందులో ఎవరిని పిలవాలో డిసైడ్ చేసుకోవాలన్నాడు.. ఇంతలో `నువ్వు బాగా తెగించావురా` అంటూ బ్రహ్మీ డైలాగ్ ని వేసి నవ్వులు పూయించారు.
ఆ తరువాత రాఖీ పూర్ణిమ సీరియల్ నుంచి మధుబాబు తో కలిసి మరో ఇద్దరు `మమ మమ మహేష్.. `అంటూ సాగే పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఆ తరువాత `దేవత` సీరియల్ టీమ్ నుంచి అర్జున్, సుహాసిని `దేవత` సినిమాలోని `యెల్లువచ్చె గోదారమ్మా...` పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. మధ్యలో అర్జున్ పై `రాఖీ పూర్ణిమ` టీమ్ కు చెందిన సుష్మిత వేసిన పంచ్ లు నవ్వులు పూయించాయి. ఆ తరువాత సెట్ లో సుహాసిని చేసే హడావిడీ ని అనుకరించాడు అర్జున్ అంబటి. ఆ వెంటనే `రాఖీ పూర్ణిమ` నుంచి మధుబాబు టీమ్ `రంగస్థలం`నుంచి ఆగట్టు నుంటావా? .. పాటకు అదరిపోయే చిందులేశారు. ఫైనల్ గా మహిశాసుర మర్థిని రూపరాన్ని అర్జున్ అంబటి బృందం చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.