English | Telugu

Sridevi drama company promo : ఫైమా తలమీద బీర్ బాటిల్ తో కొట్టిన ఆటో రాంప్రసాద్!

మల్లెమాల సంస్థ నుంచి వచ్చే ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాలకు మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. జబర్దస్త్ వంటి కామెడీ షోతో ట్రెండ్ సెట్ చేసిన ఈ సంస్థ నుంచి వచ్చిందే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. మొదట్లో ఎవరెవరో కమెడియన్లతో సీరియల్ హీరోని యాంకర్‌గా పెట్టి వ్యూస్ రాబడదామని ప్లాన్ చేశారు. అయితే రెండు మూడు వారాలకే ఇందులో నస తప్ప పస లేదని తేలిపోయింది. కుళ్లు జోకులతో కామెడీ కంటెంట్ లేదని తేలిపోయింది. ఇప్పుడు సుడిగాలి సుధీర్ యాంకర్ గా చేస్తూ ట్రెండింగ్ లో సాగుతుంది.

ఇక తాజాగా గణపతి బప్ప మోరియా అంటు వచ్చిన ఈ ప్రోమో ఆకట్టుకుంటుంది. వర్ష , ఆటో రాంప్రసాద్ మధ్య మాటల యుద్ధంతో పాటు కమెడీయన్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగే వేలంపాట‌‌ సాగినట్టు తెలుస్తోంది. ఇక రష్మీ, ఇంద్రజ ఇద్దరు కలిసి ఓ డీజే సాంగ్‌కి అదిరిపోయే స్టెప్‌లు వేసి అదరహో అనిపించారు. ఇది కదా గ్రేస్ అంటే.. ఇది కదా డాన్స్ అంటే అన్నట్టు పోటీపడి డాన్స్ చేసి స్టేజ్‌ని షేక్ చేశారు. ఇక ఫైమా, నరేష్ కలిసి కొన్ని కళరీ ప్రదర్శనలు చేశారు. ఇలాంటివి ఇంటివద్ద చేయొద్దని చెప్తూ ఓ ట్యాగ్ కూడా వేశారు. ఫైమా చేతితో కుండలని పగులగొట్టడం, నరేశ్ చేతులతో పెంకులని విరగొట్టడం చేశారు. ఫైమా తలమీద ఆటో రాంప్రసాద్ బీర్ బాటిల్ తో కొట్టినట్టు తెలుస్తోంది. ఇక నరేశ్ కి గట్టిగానే తగిలినట్టుంది దాంతో వర్ష వచ్చి తనని ఓదార్చడంతో ఎడిటర్ మామ.. ' దేవుడు ఓదారుస్తున్నాడు' అంటు ఖలేజా మూవీలోని బ్రహ్మీ డైలాగ్ ని వేసేశాడు.

ఇక బుల్లెట్ భాస్కర్ , చమ్మక్ చంద్ర, రాములమ్మ, వర్ష, ఆటో రాం ప్రసాద్, పంచ్ ప్రసాద్, నరేశ్ ఇలా‌ అందరు పంచ్ లతో ఫుల్ ఫన్ ని క్రియేట్ చేస్తున్నారు. హైపర్ ఆది, ఇంద్రజల మధ్య తాజాగా ఓ గొడవ కూడా జరిగింది. తను వేసే నాన్ వెజ్ జోకులకి ఇది సరైన ప్లేస్ కాదంటూ ఇంద్రజ అతడికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అలాగే యాంకర్ గా సుధీర్ కంటే రష్మీనే బెటర్ అని , అసలు సూధీర్ లో యాంకర్ నే చూడలేదని ఇంద్రజ చెప్పడంతో అది వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...