English | Telugu
జ్వాలకు షాకిచ్చిన నిరుపమ్
Updated : May 31, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు విషాదాంతపు ఎండింగ్ ని ఇచ్చేసిన దర్శకుడు కాపుగంటి రాజేంద్ర వారి పిల్లలు పెద్దవాళ్లు కావడం నుంచి సీరియల్ ని కొత్త మలుపు తిప్పి నడిపిస్తున్నారు. ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నా కొంత వరకు ఫరవాలేదనిపిస్తూ స్టార్ మా లో ప్రసారం అవుతోంది. గత కొన్ని వారాలుగా విజయవంతంగా సాగుతున్న ఈ సీరియల్ ఈ మంగళవారం సరికొత్త టర్న్ తీసుకోబోతోంది. నిరుపమ్ ఈ రోజు జ్వాలకు షాక్ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోందంటే..
నిరుపమ్ జరిగిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతుంటాడు. ఇంతలోనే అక్కడికి హిమ వచ్చి డాక్టర్ నిరుపమ్ అని పిలవడంతో వెంటనే నిరుపమ్ కోపంతో రగిలిపోతూనే ఏమయింది హిమ బావ అనే పిలుపు కూడా మర్చిపోయి డాక్టర్ నిరుపమ్ అని పిలుస్తున్నావు అంంటూ ఆగ్రహంతో ఊగిపోతాడు. అప్పుడు హిమ `నేను నీకు కరెక్ట్ కాదు అనుకుంటున్నాను` అంటుంది. నువ్వు అనుకుంటే కాదు నేను కూడా అనుకోవాలి` అంటాడు. అంతలోనే అక్కడికి శోభ వస్తుంది. హిమపై కోపంతో నిరుపమ్ శోభని తీసుకుని బయటికి వెళతాడు.
కట్ చేస్తే.. సౌందర్య ఇంట్లో హిమ పెళ్లిచూపులు జరుగుతుంటాయి. ఈ విషయాన్ని స్వప్న తన తనయుడు నిరుపమ్ కు చెబుతుంది. ఇక హిమని మర్చిపో అంటుంది. కానీ నిరుపమ్ మాత్రం హిమనే తలుచుకుంటూ చీకటి గదిలో కూర్చుని ఎమోషనల్ అవుతుంటాడు. ఇదే సమయంలో స్వప్న.. శోభ గురించి చెబుతుంది. తనే నా పెద్ద కోడలని ఫిక్సయ్యానంటుంది. అంతే కాకుండా హిమ పెళ్లికి రెడీ అవుతుంటే నువ్వు ఇంకా తననే గుర్తు చేసుకుంటూ వుంటావా? అంటుంది. ఆ తరువాత హిమని కలిసిన నిరుపమ్ నీకు పెళ్లంటూ జరిగితే అది నాతోనే అనడంతో ఆ మాటలు చాటుగా విన్న జ్వాల (శౌర్య) షాకవుతుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.