English | Telugu

ఫిబ్ర‌వ‌రి 14.. ష‌న్ను - దీప్తిల మ‌ధ్య ఏం జ‌ర‌గ‌బోతోంది?

బిగ్‌బాస్ సీజ‌న్ 5 కొంత మందిని హీరోల‌ని చేస్తే మ‌రి కొంత మందిని జీరోల‌ని చేసింది. చాలా వ‌ర‌కు సీజ‌న్ 5 కార‌ణంగా ప్రేమ జంట‌లు బ్రేక‌ప్ చెప్పుకుని వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా దీప్తి సున‌య‌న‌, షన్నుల ప్రేమ క‌థ‌కు బిగ్‌బాస్ కార‌ణంగా ఎండ్‌కార్డ్‌ప‌డిపోయింది. సీజ‌న్ 5 పూర్తి కాగానే ష‌న్నుకు దీప్తి బ్రేక‌ప్ చెప్పేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా దీప్తి పెట్టిన బ్రేక‌ప్ పోస్ట్ వైర‌ల్‌గా మారి నెట్టింట చ‌ర్చ‌నీయాంశం అయిన విష‌యం తెలిసిందే.

గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వున్న దీప్తి, ష‌న్ను బిగ్‌బాస్ కార‌ణంగా విడిపోవాల్సి వ‌చ్చింది. షో ముగిసి రోజులు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ వీరిద్ద‌రి మ‌ధ్య పెరిగిన దూరం త‌గ్గ‌డం లేదు. ష‌న్ను తండ్రి వీళ్లు మ‌ళ్లీ క‌లుస్తార‌ని ప్ర‌క‌టించినా అందుకు ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. షన్నుని ఉద్దేశించి దీప్తి పెట్టిన పోస్ట్ లు వీరి మ‌ధ్య మ‌రింత దూరాన్ని పెంచేవిగా వున్నాయో కానీ త‌గ్గించేవిగా లేవు. దీంతో అంద‌రి చూపు ఇప్ప‌డు ఫిబ్ర‌వ‌రి 14 పై ప‌డింది.

అయితే ష‌న్ను చేసిన‌ప‌ని ఇప్పుడు దీప్తి ఫ్యాన్స్ తో పాటు అత‌ని అభిమానుల్ని కూడా ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంది. దీప్తి మ‌న‌సు క‌రిగి మ‌ళ్లీ ష‌న్నుతో క‌లుస్తుంద‌ని అంతా ఎదురుచూస్తుంటే ష‌న్ను మాత్రం `మై ల‌వ్ ఈజ్ గాన్‌.. అనే పాట‌కు స్టెప్పులేసి ఆ వీడియోని నెట్టింట షేర్ చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఫిబ్ర‌వ‌రి 14 వ‌ర‌కు అయినా వీళ్లు క‌లుస్తారా? .. లేక ష‌న్ను చేసే పిచ్చి ప‌నుల కార‌ణంగా శాశ్వ‌తంగా విడిపోతారా అని అభిమానులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...