English | Telugu
వసుధారకు సాక్షి స్ట్రాంగ్ వార్నింగ్
Updated : May 30, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `గుప్పెడంత మనసు`. గత కొంత కాలంగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సాగుతూ చిత్ర విచిత్రమైన మలుపులతో ఆకట్టుకుంటోంది. కన్నడ యువ జంట ముఖేష్ గౌడ, రక్ష గౌడ జంటగా నటించారు. ఇతర ప్రధాన పాత్రల్లో వెండితెర నటుడు సాయి కిరణ్, జ్యోతి రాయ్, మిర్చి మాధవి, ఉషశ్రీ నటించారు. ఈ సోమవారం ఎపిసోడ్ లో ఏం జరగబోతోంది? కథ ఎలాంటి మలుపులు తిరగనుందన్నది ఇప్పడు చూద్దాం.
వసుధారకు రిషీ ఐలవ్ యూ చెప్పడంతో తను చాలా అప్ సెట్ అవుతుంది. నువ్వు చెప్పావు కదా అని నేను చెప్పాలా? అంటూ రిషీ ప్రేమని వసుధార తిరస్కరిస్తుంది. దీంతో రిషి తీవ్రంగా అప్ సెట్ అవుతాడు. వసుధార ఎందుకిలా ప్రవర్తిస్తుందో అర్థం కాక పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ ఎక్కడికో వెళ్లిపోతాడు. రిషీ ఇచ్చిన షాక్ లో వసుధార వుండగా తనకి సాక్షి మరో షాకిస్తుంది. సాక్షి మాట్లాడుతూ నా టార్గెట్ నువ్వు కాదు రిషి అని చెబుతుంది. రిషీ పరువు తీస్తాను. మీ ఇద్దరి బాగోతం బయటపెడతాను. డిబీఎస్ ఎంబీ రిష్యేంద్ర భూషణ్ బాగోతం చూడండి అంటూ మీ ఫొటోలు ప్రదర్శించి ఉన్నవి లేనివి కల్పించి మీ బాగోతం అంతా బయటపెడతాను.
తల్లీ కొడుకుల్ని విడదీస్తాను అంటుంది సాక్షి. ఆ మాటలకు వసుధార షాక్ కు గురవుతుంది. ఇవన్నీ నేను చేయకూడదు అంటే నువ్వు రిషీకి దూరంగా వుండాలంటూ వసుధారకు సాక్షి వార్నింగ్ ఇస్తుంది. అయితే షాక్ నుంచి తేరుకున్న వసుధార `నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రిషీ సార్ లైఫ్ లోకి రాలేవని స్ట్రాంగ్ గా సాక్షికి వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో వసుధారకు `నువ్వు నన్ను వదిలేసినా నిన్ను నేను వదలను.. నీకు క్యాబ్ బుక్ చేశాను. అందులో వెళ్లిపో` అని రిషి మెసేజ్ పెడతాడు. క్యాబ్ లో వెళుతూనే నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవని మరోసారి సాక్షికి వార్నింగ్ ఇస్తుంది వసుధార. ఆ తరువాత ఏం జరిగింది? రిషి ఎక్కడున్నాడు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.