English | Telugu
బిగ్ బాస్ ఓటీటీ: స్రవంతికి రెండు సార్లు పెళ్లెందుకైంది?
Updated : Mar 27, 2022
బిగ్‌బాస్ ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ రసవత్తరంగా సాగుతోంది. ఇంటి సభ్యులు ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. చాలా వరకు కంటెస్టెంట్ లు బిగ్ బాస్ 4 రన్నరప్ అఖిల్ ని సపోర్ట్ చేస్తూ బిందు మాధవిని టార్గెట్ చేస్తున్నారు. దీంతో బిందు మాధవి కూడా అఖిల్‌పై, అఖిల్ బ్యాచ్ పై మాటల తూటాలు పేలుస్తోంది. అఖిల్- బిందు మాధవిల మధ్య తాజాగా మాటల యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఆడ అంటూ బిందు మాధవి .. అఖిల్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పడు ఇద్దరి మధ్య కొత్త చిచ్చు పెట్టాయి.
ఇదిలా వుంటే మరో కంటెస్టెంట్ స్రవంతి పెళ్లిళ్లపై ఆసక్తికరమైన చర్య జరుగుతున్న విషయం తెలిసిందే. హౌస్ లో బాగా ఆడేవాళ్లు వున్నా బిగ్ బాస్ మాత్రం కావాలని స్రవంతిని ఏరి కోరి మరీ రక్షిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్రవంతి భర్త.. తమ పెళ్లి పై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించాడు. అలాగే రెండు సార్లు స్రవంతి, తాను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్రవంతి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొందని, అయితే తాము నెగెటివ్ కామెంట్స్‌ని పాజిటివ్ గానే తీసుకుంటామని చెప్పుకొచ్చాడు.
'స్రవంతిని చాలా మంది ఫిటింగ్ మాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారు. గేమ్ లో వున్న వాళ్లకి తెలుసు స్రవంతి అంటే ఏంటో.. ఇప్పుడు గేమ్ మొదలు పెట్టింది. ఇకపై తను కొత్తగా కనిపిస్తుంది. మా వ్యక్తిగత విషయానికి వస్తే .. స్రవంతికి నాకు రాసిపెట్టి వుంది. మేం ఇద్దరం కలవడం డెస్టినీ అని చెప్పాలి. నేను తెలంగాణ... ఆమె ఆంధ్రా.. ఒక ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయ్యింది. ఆ తరువాత రిలేషన్ షిప్ లో ఉన్నాం. ఆమె పరిచయం అయిన ఆర్నెళ్ల తరువాత రిలేషన్ షిప్ స్టార్ట్ చేశాం. స్రవంతి ఇంట్లో పెళ్లి కోసం కంగారు పెట్టడంతో ఎవరికీ తెలియకుండా పెళ్లిచేసుకున్నాం.. పెళ్లిచేసుకున్న విషయం ఇంట్లో వాళ్లకి తెలిసి ఇంటికి రానివ్వలేదు. ఆ తరువాత బిజినెస్ పరంగా లాస్ వచ్చింది.. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ముందు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. ఆ తరువాత అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నామని అలా రెండు సార్లు మా పెళ్లి జరిగింది' అని స్రవంతి భర్త తెలిపారు.