English | Telugu
కుప్పకూలిన రష్మీగౌతమ్!
Updated : May 31, 2022
గత కొన్ని నెలలుగా విజయవంతంగా సాగుతోంది `శ్రీదేవి డ్రామా కంపెనీ`. అయితే ఈ షోలో తాజాగా వివాదం చోటు చేసుకుంది. ఇమ్మానుయేల్అసభ్యంగా ప్రవర్తిస్తూ హీరోయిన్ పూర్ణని తాకాడు. దీంతో తను హర్ట్ అయింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పక్కన వుంటే అడ్వాంటేజ్ గా తీసుకుని తాకేస్తావా? అంటూ పూర్ణ ఫైరయింది. వెంటనే స్టేజ్ దిగి వెళ్లిపోయింది. ఇదిలా వుంటే ఈ గొడవని చూస్తూ షాక్ కు గురైన యాంకర్ రష్మీ గౌతమ్ వున్నట్టుండి వేదికపైనే కుప్పకూలిపోయింది.
ఈటీవీలో ప్రసారం అవుతున్న `శ్రీదేవి డ్రామా కంపెనీ` కామెడీ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ కనిపించలేదు. జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ కూడా కనిపించలేదు. కొత్తగా ఇందులో పూర్ణ ఎంట్రీ ఇచ్చింది. తనతో పాటు రష్మీ గౌతమ్ కూడా షోలోకి ఎంటరైంది అయితే ఎంటరైన తొలి షోలోనే రష్మీ గౌతమ్ సొమ్మసిల్లి వేదికపైనే కుప్పకూలడం పలువురిని షాక్ కు గురి చేస్తోంది.
ఫస్ట్ టైమ్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణని హైపర్ ఆది హగ్గు అడిగాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పూర్ణ 'ఆ హగ్గులు ఇవ్వలేకే ఢీ మానేశాను. మళ్లీ ఇక్కడ కూడా హగ్గులంటే ఇది కూడా మానేస్తాను' అంటూ సెటైర్ వేసింది. ఆ వెంటనే ఒరియా యాంకర్, మలయాళీ జడ్జ్ తో షో అదిరిపోతుందిప్పుడు అంటూ హైపర్ ఆది యాంకర్ రష్మీ గౌతమ్, పూర్ణలపై పంచ్ వేశాడు. ఇక ఆ తరువాత రష్మీ చేసిన డ్యాన్స్ షోకి హైలైట్ గా నిలిచింది. ఆ తరువాత రష్మీ తో యాంకర్ గా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టీమ్ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. జూన్ 5న ఆదివారం మధ్యాహ్నం ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్ కు సంబంధించిన తాజా ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.