English | Telugu
సుడిగాలి సుధీర్ సరసం మరీ ఎక్కువైందన్న రష్మీ
Updated : Mar 16, 2022
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్ లకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టేజ్ పై ఇద్దరు కలిశారంటే ఆ కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంటుందంటారంతా. ఈ ఇద్దరు జబర్దస్త్ షోతో మరింతగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. వీరి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూడని వారులేరు. చివరికి ప్రొడ్యూసర్స్ కూడా వీరిద్దరితో సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేసి చివరికి విఫలమయ్యారు. రష్మి అంగీకరించకపోవడంతో సినిమా కార్యరూపం దాల్చలేదు.
వీరిద్దరు బుల్లితెరపై ఏ షో చేసినా అది సూపర్ హిట్టే.. అంతలా ఈ జోడీ పాపులారిటీని సొంతం చేసుకుంది. గత కొంత కాలంగా వీరిద్దరు కలిసి షోలు చేయడం లేదు. తాజాగా ఈ ఇద్దరు స్టార్ మా ఛానల్ ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో దర్శనమిస్తున్నారు. ఈ నెల 20న ప్రత్యేకంగా ఓ స్పెషల్ ఈవెంట్ ని ప్లాన్ చేసింది స్టార్ మా. ఈ షోలో సుడిగాలి సుధీర్ , రష్మీ గౌతమ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. చాలా కాలం తరువాత జంటగా కనిపించడంతో అక్కడున్న వారంతా ఈ జోడీ కనిపించగానే ఆరుపులు కేకలతో రచ్చ చేశారు.
ఇదే అదనుగా అనుకున్న సుడిగాలి సుధీర్ .. మరో సారి రష్మీ గౌతమ్ ని ఇంప్రెస్ చేయడం మొదలు పెట్టాడు. రష్మీని ఐస్ చేస్తూ పాటలు అందుకున్నాడు. చురాలియా.. అంటూ ఓ పాటేసుకున్నాడు. మధ్యలో దూరిన యాంకర్ రవి సుధీర్ - రష్మీల మధ్య వున్న బంధాన్ని బయటకు లాగే ప్రయత్రం చేశాడు. ఛాన్స్ ఇస్తే రష్మీ.. సుధీర్ కు ఏం ఇవ్వాలనుకుంటుంది? అని రష్మిని రవి అడిగేశాడు. సుధీర్ ని చూస్తూ `ఇచ్చేయమంటావా? అంది రష్మీ.. కెమెరా ముందు ఇచ్చేదేనా..? అని సుధీర్ కొంటెగా చెప్పడంతో. రష్మీ .. సుధీర్ ని ఒక్కటేసి నీకు సరసాలు ఎక్కువయ్యాయి అంటూ కౌంటరిచ్చింది. ఆ వెంటనే యాంకర్ రవి మధ్యలో దూరి .. రష్మీ ఫోన్ లో సుధీర్ నంబర్ ఏ పేరుతో వుంటది? అని అడిగేశాడు. దీనికి సమాధానం దాటవేసిన రష్మీ నవ్వుల్లో మునిగిపోయింది. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.