English | Telugu

సీనియ‌ర్ న‌టి కూడా 'ఊ' అంటావా.. అంటోంది!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `పుష్ప ది రైజ్‌`. సుకుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీ వర‌ల్డ్ వైడ్‌గా వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా హిందీ వెర్ష‌న్ ఉత్త‌రాదిలో వ‌సూళ్ల ప‌రంగా దుమ్ము దులిపేస్తోంది. ఊహించ‌ని స్థాయిలో ఆక్క‌డి ప్రేక్ష‌కులు `పుష్ప‌`కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక ఇందులో క్రేజీ స్టార్ స‌మంత చేసిన `ఊ అంటావా మావ ఊహూ అంటావా...` ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. ఇప్పుడు ఈ పాట‌కు చిన్నాపెద్దా అంతా చిందులేస్తూ ర‌చ్చ చేస్తున్నారు. టీవీ ఆర్టిస్ట్ ల‌తో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లు కూడా ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ వైర‌ల్ అవుతున్నారు.

Also read: 'రావ‌ణాసుర‌'తో సెప్టెంబ‌ర్ నెల‌ క‌లిసొచ్చేనా!?

ఇటీవ‌ల బుల్లితెర సెన్సేష‌న్స్ ర‌ష్మి గౌత‌మ్‌, విష్ణు ప్రియ‌, యూట్యూబ్ స్టార్ అషురెడ్డి ఈ పాట‌ని రీక్రియేట్ చేసి ఓ రేంజ్ లో ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని మ‌ర్చిపోక ముందే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి ఈ పాట‌కు చిందులేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. భాగ్య‌రాజా న‌టించిన `గౌర‌మ్మ నీ మొగుడెవ‌ర‌మ్మ‌` చిత్రంతో డేరింగ్‌ హీరోయిన్ పాపుల‌ర్ అయిన ప్ర‌గ‌తి గ‌త కొంత కాలంగా త‌ల్లి, అత్త పాత్ర‌లు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

న‌టిగా బిజీగా వుంటున్నా టైమ్ దొరికితే వ‌ర్క‌వుట్ ల‌తో జిమ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారామె. గ‌తంలో `మాస్ట‌ర్‌` టైటిల్ సాంగ్ కి జిమ్ లో చిందేసి ర‌చ్చ చేసిన ప్ర‌గ‌తి తాజాగా స‌మంత చేసిన `ఊ అంటావా మావ‌.. పాట‌కు అదిరిపోయే స్టెప్పులేసి షాకిచ్చింది. జిమ్ లో వ‌ర్క‌వుట్ లు చేస్తూ ఖాలీ స‌మ‌యం చిక్క‌డంతో `ఊ అంటావా.. పాట‌కు అదిరిపోయే స్టెప్పులేసి హంగామా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...