English | Telugu
స్టార్ మా లో కొత్త సీరియల్ `నువ్వు నేను ప్రేమ`
Updated : May 16, 2022
బుల్లతెర ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ స్టార్ మా పలు విభిన్నమైన సీరియల్స్‌ని అందిస్తోంది. అందులో చాలా వరకు సీరియల్స్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కార్తీక దీపం, ఇంటింటి గృహలక్ష్మి, దేవత వంటి విభిన్నమైన సీరియల్స్ తో మహిళా లోకాన్ని అలరిస్తున్న స్టార్ మా తాజా గా ఈ సోమవారం నుంచి సరికొత్త సీరియల్ ని అందిస్తోంది. స్టార్ మా అందిస్తున్న కొత్త సీరియల్ నువ్వు నేను ప్రేమ`.
ప్రతీ సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 నిమిషాలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది. ఈ సోమవారం నుంచి ఈ సీరియల్ ప్రసారం ప్రారంభం కాబోతోంది. ఇందులో ప్రేమ మాత్రమే కాకుండా రెండు కుటుంబాల బంధాలు, మమతానురాగాలు, బాధ్యతల నేపథ్యంలో ఈ సీరియల్ సాగనుంది. ఓ యువకుడి అహంకారానికి, ఓ యువతి ఆత్మగౌరవానికి మధ్య సాగే అందమైన కథగా దీన్ని మహిళా ప్రేక్షకులకు అందిస్తున్నారు.
కుటుంబ భారీన్ని మోయడానికి ఉద్యోగంలో చేరిన ఓ యువతికి, తన అహంకారంతో ఓ యువకుడు ఎలాంటి ఇబ్బందుల్ని కలిగించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గొడవలతో మొదలైన వీరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ..తరువాత వారి జీవితాల్ని ఎలా ఒక్కటి చేసింది? అన్నదే ఈ సీరియల్ ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటూ మహిళా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేస్తోంది.