English | Telugu
నటరాజ్ మాస్టర్ తాట తీసిన బిందుమాధవి
Updated : Mar 9, 2022
ఓటీటీ వెర్షన్ బిగ్బాస్ నాన్ స్టాప్ గత నెల 26న మొదలైన విషయం తెలిసిందే. ముమైత్ ఖాన్ రూపంలో ఫస్ట్ వికెట్ పడిపోయింది కూడా. గేమ్ లో కులా రచ్చ కూడా మొదలైంది. దీంతో హౌస్ ఒక్కసారిగా హీటెక్కింది. యాంకర్ స్రవంతి హద్దులు దాటి మాట్లాడుతున్న తీరు సరికొత్త వివాదానికి దారితీసేలా వుంది. ఇక నటి బిందు మాధవి అనూహ్యంగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాత కంటెస్టెంట్స్ అఖిల్, నటరాజ్ మాస్టర్, తేజస్వి భయపడిపోతున్నారు. అయితే బిందు మాధవిని ఢికొట్టే సత్తా ఎవరికీ లేకపోవడంతో అంతా ఆమెని మాటలతో వెనక్కి నెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇప్పటికే హౌస్ లో ఆడపులిలా మారిన బిందు మాధవిని ఇప్పటికే ఆట ఆడటం మొదలుపెట్టింది. ఏకంగా అఖిల్, నటరాజ్ మాస్టర్, తేజస్విలకు నిద్రలేకుండా చేస్తోంది. దీంతో ఆమెపై ఈ ముగ్గురు మాటల దాడికి దిగుతున్నారు. సమయం చిక్కినప్పుడల్లా బిందు మాధవిపై సెటైర్లు వేస్తున్నారు. అవకాశం కోసం చూస్తున్న బిందు బమాధవి.. నటరాజ్ మాస్టర్ ని అడ్డంగా బుక్ చేసిన ఓ ఆట ఆడేసుకుంది. బుధవారం ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ కావాలనే బిందు మాధవిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి పప్పులో కాలేశాడు.
వారియర్స్ కి తమ వసతులును గెలుచుకునే టాస్క్ లో బాస్కెట్ బాల్ వేసి వారియర్స్ గెలుచుకున్నారు. అందుకు గానూ వారియర్స్ బెడ్ రూమ్, లగేజ్ వసతిలో ఒక దాన్ని తిరిగి పొందవచ్చుని రూల్ బుక్ లో రాసివుందని నటరాజ్ చదవి వినిపించాడు. అక్కడే అతన్ని బిందు మాధవి లాక్ చేసేసింది. మరో సారి రూల్స్ బుక్ లో ఏం రాసి వుందో చదవమని చెప్పింది. ఏదో ఒకటి మాత్రమే బిగ్బాస్ కి చెప్పండని రూల్ బుక్ లో వుందని క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం తెలియని నటరాజ్ మాస్టర్ బిందు బాదవిపై సెటైర్లు వేయడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగక వెటకారంగా మాట్లాడుతూ బిందుఏ మాధవిని చూపిస్తూ శ్రీరాపాకకు, తేజస్విలకు సైగ చేశాడు. వెంటనే గమనించిన బిందు మాధవి `ధైర్యం వుంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. పాసింగ్ కామెంట్స్ చేస్తే చాలా చీప్ గా వుంటుంది` అంటూ నటరాజ్ మాస్టర్ కు దిమ్మదిరిగే షాకిచ్చింది. వెనక మాట్లాడటం కాదంటూ మాస్టర్ తాట తీసినంతపని చేసింది.