English | Telugu

Naga Manikanta : నాకు ఓట్లు వేయకండి.. ప్లీజ్ నన్ను  హౌస్ నుండి బయటకు పంపండి!

బిగ్ బాస్ లోకి ఛాన్స్ రావడం అంటే మాములు విషయం కాదు.. అలాంటిది వచ్చిన ఛాన్స్ దుర్వినయోగం చేసుకోవడమంటే అంతకన్నా దురదృష్టం ఇంకొకటి ఉండదు. ఇదంతా మన క్రయింగ్ స్టార్ మణికంఠ బాబు గురించే.. షో మొదటి నుండి హౌస్ మేట్స్ తో పాటు ఎవరికి అర్థం కాని వింత మనిషి. ఎవరు కూడా ఇంతవరకు అతని విషయంలో ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. అప్పుడే రామూలా మారి కాసేపటికి రెమోలా.. ఇంకాసేపటికి అపరిచితుడులాగా కన్పిస్తాడు.

ఇన్ని రోజులు హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వకూడదు.. నాకు నా ఫ్యామిలీ కావాలంటూ ఏడ్చాడు. ఇక్కడివరకు ఎలాగోలా నెట్టుకొచ్చాడు. ఇక ఇప్పుడేమో మణికంఠ ఒంటరిగా సోఫాలో కూర్చొని.. నాకు ఎక్కువ స్ట్రెస్ ఉంది.. నేను ఉండలేను.. ప్లీజ్ నాకు ఓటు వెయ్యకండి. నన్ను ఎలిమినేట్ చెయ్యండి. నా హెల్త్ కండిషన్ బాగోలేదు.. ఛాతిలో నొప్పిగా ఉంది ప్లీజ్ అంటూ మణికంఠ రిక్వెస్ట్ చేశాడు. అప్పుడే హరితేజ వచ్చి.. అక్కడ టిష్యూ ఉందని అనగానే మణికంఠ ఏడుస్తుంటాడు. దాంతో హరితేజ వచ్చి మణికంఠని సముదాయించే ప్రయత్నం చేస్తుంది.

శనివారం రోజు నాగార్జున స్టేజి పైకి వచ్చాక.. మణికంఠ ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతాడు. నాకు ఉండాలని లేదు సర్.. బాడీ పెయిన్ అని అంటాడు. డాక్టర్ వచ్చాడు కదా.. అన్ని టెస్ట్ లు చేసాడు. అన్ని ఫైన్. మరి ఇంకేంటి అంటూ నాగార్జున సీరియస్ అవుతాడు. ఏమో సర్ నాకు తెలియదు. నేను ఉండాలి.. గెలవాలని వచ్చాను.. కానీ ఇప్పుడు నా వాళ్ళ కావడం లేదు. ప్లీజ్ రిక్వెస్ట్ సర్ పంపించండి అని మణికంఠ అనగానే.. చూద్దాం ఆడియన్స్ ఎవరిని డిసైడ్ చేసారో అని నాగార్జున అంటాడు.

ఉన్నటుండి మణికంఠ ఎందుకు ఇలా చేంజ్ అయ్యాడో తెలియదు. మొన్న గంగవ్వతో.. హౌస్ లో ఉండాలి.. ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు అర్ధ తులం బంగారం ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత శనివారం టాస్క్ లో భాగంగా బిబి టైమ్స్ హెడ్ లైన్స్ ఇచ్చాడు నాగార్జున. 'ఆటలో వీక్.. డ్రామాలో పీక్'.. 'కన్నీరే మాత్రమే ఆయుధం' అనే రెండు హెడ్ లైన్స్ మణికంఠకి ఇవ్వగా హౌస్ మాట్స్ అందరు ఎస్ అని చెప్పారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...