English | Telugu

తాటికొండ‌లో మోనిత‌, సౌంద‌ర్య‌, ఆనందరావు!

బుల్లితెర ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న పాపుల‌ర్ సీరియ‌ల్ `కార్తీక దీపం`. ప్రేమీ విశ్వ‌నాథ్‌, ప‌రిటాల నిరుప‌మ్ దంప‌తులుగా న‌టిస్తున్న ఈ సీరియ‌ల్ గ‌త కొన్ని వారాలుగా ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో సాగుతూ ఆక‌ట్టుకుంటోంది. ఈ మంగ‌ళ‌వారం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించ‌బోతోంది. దీప, డాక్ట‌ర్ బాబు త‌న పిల్ల‌ల‌తో క‌లిసి తాటికొండ గ్రామంలో త‌ల‌దాచుకుంటుంటారు. అక్క‌డికే ఒక‌వైపు మోనిత‌.. మ‌రోవైపుసౌంద‌ర్య, ఆనంద‌రావులు వ‌స్తే ఏం జ‌రిగింది? అన్న‌ది ఈ రోజు ఆస‌క్తిక‌ర అంశం.

ఈ మంగ‌ళ‌వారం 1246వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. దీప‌, కార్తీక్ ల‌ని వెతుక్కుంటూ సౌంద‌ర్య‌, ఆనంద‌రావు కారులో బ‌య‌లుదేర‌తారు. 'శ్రావ్య‌, ఆదిత్య‌ల‌కు అప్ప‌గింత‌లు పెట్టి మావ‌య్య‌, ఆంటీ ఎక్క‌డికి వెళుతున్నారు? .. ఫాలో అయితే పోలా?' అంటూ మోనిత కారులో ఫాలో అవుతుంది. క‌ట్ చేస్తే కార్తీక్.. బాబుతో ఆడుకుంటూ 'ఏంట్రా ప‌డుకో' అంటాడు. వెంట‌నే దీప 'ఏమండీ త‌న‌ని అరే ఒరే అన‌కండి.. ఆనంద్ అంటే మావ‌య్య‌గారి పేరుగా` అంటుంది. కార్తీక్ కి గ‌తంలో మోనిత అన్న మాట‌లు గుర్తొస్తాయి.

క‌ట్ చేస్తే కారులో సౌంద‌ర్య‌, ఆనంద‌రావు తాడికొండ గ్రామంలోకి వెళ్తారు. వెన‌కే వ‌స్తున్న మోనిత షాకై 'ఏంటీ ఇది ప్రియ‌మ‌ణి ఊరు క‌దా? కొంప‌దీసి త‌ను పార్టీ మార్చీ వీరికి స‌హ‌క‌రించ‌డం లేదు కదా?' అని అనుమానిస్తుంది. అయితే సౌంద‌ర్య‌, ఆనంద‌రావు వ‌చ్చింది ఆ గ్రామంలోని ప్ర‌కృతి వైద్య‌శాల‌లో చేర‌డానిక‌ని తెలిసి మోనిత ఊపిరి పీల్చుకుంటుంది. 'ఎందుకో ఒకందుకు ఈ ఊరికైతే వ‌చ్చాను. ప్రియ‌మ‌ణి ఎక్క‌డుందో వెత‌కాలి' అని త‌న కోసం వెతుకులాట మొద‌లుపెడుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...