English | Telugu

భార్య కంటే మూడేళ్ళు చిన్న.. ట్విస్ట్ ఇచ్చిన మణికంఠ!

ఇదేందయ్యా ఇది.. మణికంఠ రోజుకో నాటకం ఆడుతున్నాడా లేక నిజంగా నిజమే చెప్తున్నాడా అర్థం అవ్వడం లేదు. ఎందుకంటే హౌస్ లోకి వచ్చిన మొదటి వారంలోనే అందరికి సెంటిమెంట్ కార్డ్ చూపించాడు. ఇప్పుడేమో మరో కొత్త ట్రాక్ వేస్తున్నాడు మణికంఠ బాబు.

హౌస్ లో ఎవరు? ఏంటనేది రోజులు గడిచేకొద్దీ అందరికి తెలుస్తుంది కానీ మన బాబు మణికంఠ ఇచ్చే ట్విస్ట్ లు ఏ సినిమాలోనూ ఉండవు.. ప్రతీ సీను క్లైమాక్స్ లా ఉంటది. నిన్నటి ఎపిసోడ్ లో నాగ మణికంఠ ఓ సీక్రెట్ రివీల్ చేశాడు. గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ, హరితేజలతో తన భార్య తనకి పంపిన లెటర్ గురించి మణికంఠ చెప్పాడు. లెటర్‌లో హాయ్ జూనియర్ అంటూ రాసిందంటూ మణికంఠ చెప్పగానే.. అదేంటి జూనియర్ అని పిలిచిందంటు హరితేజ, టేస్టీ తేజ వాళ్ళంతా అడిగారు. తను నన్ను కన్న, జూనియర్ అంటుంది.. తన ఫోన్‌లో నా నంబర్‌ను జూనియర్ అని సేవ్ చేసుకుంటుందని మణికంఠ చెప్పగా.. అంటే మీరు ఇద్దరూ సేమ్ కాలేజా అంటూ తేజ అడిగాడు. కాదు తనకంటే నేను మూడేళ్లు(3 Years) చిన్నోడిని అందుకని అలా జూనియర్ అంటుందని మణికంఠ చెప్తాడు. అది విన్న గంగవ్వ, టేస్టీ తేజ, హరితేజ షాకవుతారు. ఇక గంగవ్వ అయితే ఎవరికంటే చిన్నోడు వాళ్ల భార్య కంటేనా అని అడుగగా.. అవునని తేజ చెప్తాడు. దాంతో గంగవ్వ నోరెళ్ళబెడతుంది.

ఇక మొన్నటి వారంలో మణికంఠ బాబుకి వాళ్ళ ఆవిడ రాసిన లెటర్ ని బిగ్ బాస్ పంపించాడు. అందులో తనేం రాసిందో ఓసారి చూద్దాం... హే జూనియర్ కంగ్రాట్యులేషన్స్.. ఈ సీజన్‌లో జైల్లోకి వెళ్లిన ఫస్ట్ పర్సన్ నువ్వే.. గేమ్ చాలా బాగా ఆడుతున్నావ్.. బయట ఏమనుకుంటున్నారో ఆలోచించి హౌస్‌లో డిస్ట్రబ్ అవ్వకు.. మహాభారతంలో అర్జునుడిలా ఉండు.. పక్షి కన్ను మీద మాత్రమే ఫోకస్ చెయ్.. బయట మేమంతా ఉన్నాం నీకు.. ప్లీజ్ ఎమోషనల్ అవ్వకు.. ఇట్లు శ్రీప్రియ అంటు మణికంఠ భార్య రాసుకొచ్చింది. ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్-8 లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ అంతా ఒక రకం.. మనోడు మరో రకం అని అందరికి తెలిసిందే. హౌస్ లో ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కానీ వాళ్ళ లిస్ట్ లో మణికంఠ బాబు ఉన్నాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...