English | Telugu
అభిమన్యు, మాళవిక ఉచ్చులో యష్, వేద
Updated : Mar 26, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటిస్తున్నారు. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఓ పాప నేపథ్యంలో ఆసక్తికర మలుపులతో ఈ సీరియల్ ని దర్శకుడు ముందుకు నడిపిస్తున్నాడు. ఈ శనివారం ఏం జరగబోతోంది?.. పార్టీలో కలిసిన యష్ ని పక్కదారి పట్టించడానికి అభిమన్యు పన్నిన కుట్ర ఏంటీ? ..ఇందుకు మాళవిక కూడా వేదని ఎలా మరోసారి బుట్టలో వేసే ప్రయత్నం చేసింది అన్నది ఒకసారి చూద్దాం.
ఫ్రెండ్ తన 10వ మ్యారేజ్ యూనివర్సరీ అని పార్టీ ఇస్తానని యష్‌ని పార్టీకి పిలుస్తాడు. అయిష్టంగానే భార్య వేదతో కలిసి యష్ పార్టీకి వస్తాడు. అయితే అది గతంలో తనని వేధించిన ప్లేస్ కావడంతో వెంటనే తిరిగి వెళ్లిపోవాలనుకుంటాడు. అయితే అతని ఫ్రెండ్ అదేమీ కుదరదని చెప్పి యష్ ని బలవంతంగా పార్టీలోకి తీసుకెళతాడు. ఈ క్రమంలో వేదని అక్కడే వదలేసి యష్ ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీలో జాయిన్ అవుతాడు. ఇది గమనించిన అభిమన్యు .. వెంటనే మాళవికని రంగంలోకి దింపేసి వేదని ట్రాప్ చేయమని చెబుతాడు.
తను వెళ్లి యష్ ని ఉచ్చులోకి దింపే ప్రయత్నం మొదలుపెడతాడు. తనతో ప్రత్యేకంగా మాట్లాడాలని చెప్పి యష్ ని పక్కకు తీసుకెళ్లిన అభిమన్యు తన నాటకాన్ని మొదలు పెడతాడు. తన దగ్గరి నుంచి విలువైన దాన్ని లాక్కున్నావంటాడు. ఏంటని యష్ అడిగితే... ఖుషీ అని చెబుతాడు. తను నా రక్తం పంచుకు పుట్టిన పాప అని తనని నా నుంచి వేరు చేశావని కొత్త నాటకం మొదలుపెడతాడు. ఇదే సమయంలో మాళవిక.. వేదని ట్రాప్ లో పడేసే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇద్దూ అనుకున్నట్టుగానే అభిమన్యు, మాళవిక ఉచ్చులో యష్, వేద పడ్డారా? ఏం జరగబోతోంది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే .