English | Telugu

క‌న్నుకొట్టిన ర‌ష్మీ..సుధీర్ గ‌డ్డ‌ివాము క‌థేంటీ?

బుల్లితెర కామెడీ షో `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌`. ఈ షో ద్వారా చాలా మంది పాపుల‌ర్ అయ్యారు. కొంత మంది సినిమాల్లో కూడా అవ‌కాశాల్ని సొంతం చేసుకుంటున్నారు. ఇక ర‌ష్మీ గౌత‌మ్‌, సుడిగాలి సుధీర్ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిందే. ఈ షో ద్వారా వైర‌ల్ గా మారిన జంట వీరే. ఈ షో వ‌ల్ల వీరిపై రాని గాసిప్ అంటూ లేదు. అంత‌లా వీరు వార్త‌ల్లో నిలిచి సెల‌బ్రిటీలుగా మారిపోయారు. ఇప్ప‌టికీ అదే షోలో కంటిన్యూ అవుతున్నారు. సుడిగాలి సుధీర్ జ‌బ‌ర్ద‌స్త్ తో పాటు ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ లోనూ స్కిట్ లు చేస్తూ న‌వ్విస్తున్నారు.

అవకాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా ర‌ష్మీ గౌత‌మ్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా మ‌రోసారి ర‌ష్మీ గౌత‌మ్ తో సుడిగాలి సుధీర్ ఆడుకున్న తీరు హాస్య ప్రియుల‌తో పాటు బుల్లితెర వీక్ష‌కుల్నివిశేషంగా ఆక‌ట్టుకుంటోంది. `ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్` శుక్ర‌వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. రోజాతో క‌లిసి సుడిగాలి సుధీర్ `అమ్మ కొడుకు` పేరుతో స్పెష‌ల్ స్కిట్ చేశారు. ఈ స్కిట్ లో సుడిగాలి సుధీర్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. అవ‌కాశం చిక్కింది కదా అని ర‌ష్మీని ఆంటీ అంటూ అల్ల‌ర‌ల్ల‌రి చేసేశాడు.

Also Read: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్!

స్కిట్ లో భాగంగా అమాయ‌కుడైన కొడుకుగా సుధీర్ క‌నిపించాడు. `నాన్నా ఆంటీ ద‌గ్గ‌రికెళ్లి చ‌క్కెర వుందేమో తీసుక‌రానాన్నా` అని రోజా సుడిగాలి సుధీర్ తో చెబుతుంది. వెంట‌నే అలాగే అంటూ సుధీర్ .. ర‌ష్మీ ద‌గ్గ‌రికి వెళ్లి ఆంటీ న‌గానే ర‌ష్మీ భీభ‌త్స‌మైన ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చేసింది.. ఆ త‌రువాత సుధీర్ కంటిన్యూ చేస్తూ `ఆంటీ ఆంటీ షుగ‌ర్ వుందా? అని అడ‌గ‌డం.. లేదు అని ర‌ష్మీ చెప్ప‌డం.. అదేంటీ నేను టెస్ట్ చేస్తే చాలా వుంద‌న్నారు` అని సుధీర్ తిరిగి కౌంట‌ర్ ఇవ్వ‌డం... ఆ త‌రువాత ప‌ప్పుందా? అంటే లేద‌ని ర‌ష్మీ అంటే.. పోనీ ఉప్పుందా అని సుధీర్ అన‌డంతో దొరికాడ‌ని చెప్పుంద‌ని ర‌ష్మీ కౌంట‌ర్ ఇవ్వ‌డం... కెమిప్ట్రీలో మార్కులు తక్కువెందుకు వ‌స్తాయ‌ని సుధీర్ ని రోజా అడిగితే తెలియ‌దు క‌ద‌మ్మా అని చెప్ప‌డం.. వెంట‌నే రోజా .. ర‌ష్మీని చూసి నేర్చుకోవ‌చ్చుగా అని చెప్ప‌డం.. నేర్పిస్తావా? అని సుధీర్ అడిగితే ర‌ష్మీ కొంటెగా క‌న్నుగీట‌డం న‌వ్వులు పూయిస్తోంది.

Also Read:భార్య‌ను హ‌త్తుకొని వ‌ల‌వ‌లా ఏడ్చిన శివారెడ్డి!

ఆ త‌రువాత ఓ టీమ్ లీడ‌ర్ ఎంట్రీ ఇచ్చి త‌న భార్య‌ని గ‌డ్డివాము ద‌గ్గ‌రికి సుధీర్‌ తీసుకెళ్లాడ‌ని చెప్ప‌డంతో అక్క‌డికి ఎందుకు తీసుకెళ్లావ్ నాన్నా అని అడిగింది రోజా.. దానికి సుధీర్ `నిన్న పొద్దున ఇంటికొచ్చింది.. చెక్క‌ర‌డిగింది ఇచ్చా...మ‌ధ్యాహ్నం వ‌చ్చి ఉప్పు అడిగింది ఇచ్చా.. రాత్రొచ్చి వాము అడిగింది వాము నాకు క‌న‌బ‌డ‌లా అందుకే గ‌డ్డివాము ద‌గ్గ‌రికి తీసుకెళ్లా..` అని చెప్ప‌డంతో `ఎద‌గాలి ఈ ప‌సికూన ఎప్ప‌టికైనా.. అంటూ బ్యాగ్రౌండ్ సాంగ్ ప‌డింది.. న‌వ్వులు మొద‌ల‌య్యాయి.. హిలేరియ‌స్ పంచ్ ల‌తో సాగిన ఈ ఎపిసోడ్ శుక్ర‌వారం ప్ర‌సారం కానుంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...