English | Telugu

నిధి కోసం వేద‌ని ఏడిపిస్తున్న య‌ష్‌

బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. హిందీ సీరియ‌ల్ ఆధారంగా ఈ సీరియ‌ల్ ని రీమేక్ చేశారు. నిరంజ‌న్‌, డెబ్జాని మోడ‌క్‌, మిన్ను నైనిక కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బెంగ‌ళూరు ప‌ద్మ‌, అనంద్‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, మీనాక్షి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. పిల్ల‌లే పుట్ట‌న ఓ యువ‌తి.. త‌ల్లి ఆద‌ర‌ణ లేని ఓ పాప మ‌ధ్య పెన‌వేసుకున్న అనుబంధం విధి ఆడిన వింతాట‌లో ఇద్ద‌రిని త‌ల్లీకూతుళ్ల‌ని చేసింది. అనే క‌థాంశంతో ఈ సీరియ‌ల్ ని రూపొందించారు. గ‌త కొన్ని వారాలుగా మ‌హిళా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ మంచి రేటింగ్ తో `స్టార్ మా`లో కొన‌సాగుతోంది.

ఈ శ‌నివారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఒక‌సారి చూద్దాం. య‌ష్ బిజినెస్ పార్ట్న‌ర్ దామోద‌ర్ త‌న ముద్దుల చెల్లెలు నిధిని వ‌సంత్ కిచ్చి పెళ్లి చేసి బిజినెస్ బంధాన్ని కాస్తా బంధుత్వంగా మార్చుకోవాల‌ని వుందని య‌ష్ తో చెప్ప‌డంతో త‌న‌కు కొంత టైమ్ కావాల‌ని చెబుతాడు య‌ష్ . అయితే ఈ లోగా నిధిని య‌ష్‌ ఇంటికి గెస్ట్ గా కొన్ని రోజులు వుంటుంద‌ని పంపిస్తాడు దామోద‌ర్‌. అయితే య‌ష్ నిధిని వేద వాళ్ల ఇంట్లో గెస్ట్ గా వుండేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఈ లోగా నిధి ఎంట్రీ ఇస్తుంది. వేద ఇంట్లోకి ప్ర‌వేశిస్తుంది. త‌న‌కు తానే ప‌రిచ‌యం చేసుకుంటుంది.

ఈలోగా య‌ష్ ఎంట్రీ ఇస్తాడు. ఇంతలో నిధి చేసే అతి చేష్ట‌ల‌కు వ‌సంత్ ని ప్రేమించిన వేద చెల్లెలు చిత్ర వ‌సంత్‌పై ఆగ్ర‌హంతో ఊగిపోతూ వుంటుంది. నిధిని వేద త‌న గ‌దిలోకి తీసుకెళ్లాల‌ని ప్ర‌య‌త్నించ‌గా ఏదో ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వుంద‌ని య‌ష్ వెంట‌నే మా ఇంటికి వెళ‌దాం.. మా ఫ్యామిలీని ప‌రిచ‌యం చేస్తానంటూ నిధిని తీసుకెళ‌తాడు. క‌ట్ చేస్తే వంట‌లు చేసే క్ర‌మంలో వేద‌ని ఏడిపించ‌డం మొద‌లు పెడ‌తాడు య‌ష్‌. కూర‌గాయ‌లు మొత్తం వేద‌తో క‌ట్ చేయించి నీలాంటి పొగ‌రుబోతు పొగ‌రు దించితే ఆ కిక్కే వేరంటాడు. దీంతో వేద ఏడ్చుకుంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? య‌ష్ - వేద‌ల కాపురంలో నిధి ఎలాంటి ప్ర‌కంప‌ణ‌లు సృసష్టించింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...