English | Telugu
హిమగా వచ్చిన కీర్తి రియల్ లైఫ్ లో విషాదం
Updated : Mar 21, 2022
`కార్తీకదీపం` సీరియల్ సోమవారం నుంచి కొత్త మలుపు తిరుగుతోంది. డాక్టర్ బాబు, దీపల పాత్రలకు ఎండ్ కార్డ్ వేసేసిన దర్శకుడు హిమ, శౌర్యలతో మిగతా కథని కొత్త పుంతలు తొక్కించబోతున్నాడు. పిల్లలు పెద్ద వాళ్లు కావడం.. హిమపై శౌర్య పగని పెంచుకుని బయటే బ్రతుకుతుండటం వంటి సన్నివేశాలతో మొదలుపెడుతున్నాడు. ఇదిలా వుంటే ఈ సీరియల్ లో హిమ పాత్రలో నటిస్తున్న కీర్తి రియల్ లైఫ్ ఓ విషాదం. ఆరేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదంలో కీర్తి భట్ తల్లిదండ్రులతో పాటు అన్నయ్య, వదినలను కోల్పోయింది. ఆ కారు ప్రమాదంలో కీర్తిభట్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో తను కోమాలోకి వెళ్లిపోయింది.
కొన్నాళ్లకు కోలుకున్న కీర్తిభట్ `మనసిచ్చిచూడు` సీరియల్ తో తెలుగులో బుల్లితెర నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రమాదంలో కుటుంబం మొత్తం పోవడంతో అనాధగా మారిన కీర్తి ప్రస్తుతం ఓ అనాధని చేరదీసి పెంచుతోంది. గతంలో `స్టార్ మా పరివార్` కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి భట్ తన నవిషాద గాధను చెప్పుకుని భావోద్వేగానికి లోనైంది. తనకి అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన ఎవరూ లేరని.. కారు యాక్సిడెంట్ లో అంతా చనిపోయారని ఎమోషనల్ అయింది. అంతే కాకుండా `మనసిచ్చి చూడు` సీరియల్ లో తనకు తండ్రిగా నటిస్తున్న `ఛత్రపతి` శేఖర్ తనకి తండ్రిలేని లోటుని తీరుస్తున్నారని, సొంత కూతురులా చూసుకుంటున్నారని చెప్పుకొచ్చింది.
తాజాగా మరోసారి కీర్తి విషాద గాధని ఓంకార్ గుర్తు చేశారు. తను హోస్ట్ గా వ్యవహరిస్తున్న `ఇస్మార్ట్ జోడీ`లో `మనసిచ్చిచూడు` జంట పాల్గొంది. ఇందులో కీర్తి రియల్ లైఫ్ కష్టాల గురించి ఓంవకార్ చెప్పెకొచ్చారు. తనది చాలా పెద్ద ఫ్యామిలీ అని, అంతా కలిసి జర్నీ చేస్తున్న టైమ్ లో కారు ప్రమాదం జరిగి అందరూ చనిపోయారని, అయితే ఆ ప్రమాదం నుంచి బయటపడిన కీర్తి మాత్రం కోమాలోకి వెళ్లిందని, కొన్ని రోజుల తరువాత కోలుకున్న తనకి ఎవరూ లేరని తెలిసిందని, అలాంటి స్థితి నుంచి ఈ స్థాయికి వచ్చిందని చెప్పుకొచ్చారు.