English | Telugu

Karthika Deepam2 : దీపకి కొత్త జీవితమిచ్చిన కార్తీక్.. ఇక కార్తీకదీపం సీరియల్ కి అన్నీ మంచి రోజులేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -179 లో.....నా కూతురిని నేను తీసుకొని వెళ్తానని దీప అనగానే.. శౌర్య హెల్త్ కండిషన్ ని దృష్టిలో పెట్టుకొని వద్దని కార్తీక్ అంటాడు. ఇక్కడ ఎవరి గురించి నేను ఆగలేను.. ఎవరి నిర్ణయాల గురించి అవసరం లేదని దీప అంటుంది. నీకు సిచువేషన్ తెలియదు.. చెప్పిన అర్ధం కాదు.. నా మాట వినండి అంటూ కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే శౌర్య బయటకు వచ్చి.. అమ్మ అంటూ దీప దగ్గరికి వస్తుంది పదా వెళదాం ఊరికి.. బాయ్ చెప్పు అని దీప అనగానే.. నాకు కార్తీక్ కావాలి.. నాకు నాన్న కావాలని శౌర్య అంటుంది.

మీ నాన్న ఎలాంటి వాడో తెలిసి ఇలా అంటున్నవా అని దీప అంటుంది. నేను బూచోడు అనట్లేదు.. నాన్నగా కార్తీక్ కావాలని శౌర్య అనగానే చిన్నపిల్లలాగా మాట్లాడు అని దీప కోప్పడుతుంది. పదా అంటూ దీప చెయ్ పట్టుకొని లాగుతుంటే.. శౌర్య కార్తీక్ చెయ్ వదలదు.. మీకేం అధికారం ఉందని నా కూతురిని పంపనని అంటున్నారని దీప కిందపడి ఏడుస్తుంది. అప్పుడే కార్తీక్.. అయితే నీకు అధికారం కావాలా అని పూజ రూమ్ దగ్గరున్న తాళిని తీసుకొచ్చి దీప మెడలో కడతాడు. అప్పుడే జ్యోష్న వస్తుంది. అదంతా చూసి తన మనసు ముక్కలవుతుంది. నా ఫ్రెండ్ మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు నాకు నాన్న అంటూ శౌర్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తూ కాంచన ఆశ్చర్యపోతుంది. మరొకవైపు జ్యోత్స్న అందరిని తీసుకొని ఇంటికి వస్తుందని సుమిత్ర వాళ్లు ఎదురుచూస్తుంటారు. అప్పుడే జ్యోత్స్న ఏడ్చుకుంటూ రావడం చూసి అందరు ఏమైందంటూ అడుగుతారు.

నాకు బావ అన్యాయం చేసాడు.. పెళ్లి చేసుకున్నడు బావ.. ఆ దీప మెడలో తాళి కట్టాడని జ్యోత్స్న చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. మరొకవైపు కార్తీక్ ఇంటికి అనసూయ వస్తుంది. ఆ నర్సింహా గాడిని పోలీసులకి పట్టించానని అనసూయ అంటుంది. నువ్వు ఏంటి ఇలా ఉన్నావని దీపని అనసూయని అడుగగా.. నేను చెప్తానంటూ కార్తీక్ అమ్మని పెళ్లి చేసుకున్నాడని శౌర్య చెప్తుంది. తను చెప్పగానే అనసూయ మొదట షాక్ అయిన తర్వాత నా మేనకోడలికి మంచి జీవితం ఇచ్చారని కార్తీక్ కి కృతజ్ఞతలు చెప్తుంది. కాంచన కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...