English | Telugu

యూట్యూబ‌ర్ తాట తీసిన క‌రాటే క‌ల్యాణి

క‌రాటే క‌ల్యాణి నిత్యం ఏదో ఒక విష‌యం కార‌ణంగా వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇటీవ‌ల విశ్వ‌క్‌సేన్ పై ఓ టీవీ ఛాన‌ల్ సృష్టించిన వివాదంపై ఘాటుగానే స్పందించి వార్త‌ల్లో నిలిచారు క‌రాటే క‌ల్యాణి. స‌ద‌రు టీవి ఛాన‌ల్ ని ఎండ‌గ‌డుతూ విశ్వ‌క్ సేన్ కు అండ‌గా నిలిచారు. ఇక తాజాగా మ‌రో వివాదంతో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నారు. వివాదాల‌పై నేరుగా స్పందిస్తూ వార్త‌ల్లో నిలిచే క‌రాటే క‌ల్యాణి ఈ ద‌ఫా ఓ యూట్యూబ‌ర్ తాట తీసి హ‌ల్ చ‌ల్ చేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది.

యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డిపై సినీ న‌టి క‌రాటే క‌ల్యాణి దాడికి పాల్ప‌డింది. ప్రాంక్ వీడియోల పేరిట మ‌హిళ‌ల‌తో అస‌భ్యక‌ర వీడియోలు చేస్తున్నాడంటూ అత‌నిపై దాడికి దిగింది. యూసుఫ్ గూడా స‌మీపంలోని మ‌ధురాన‌గ‌ర్ రోడ్డుపై యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డి, క‌రాటే క‌ల్యాణి ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకున్నారు. ప్రాంక్ వీడియోల విష‌యంలో శ్రీ‌కాంత్ రెడ్డిని నిల‌దీయ‌డంతో తాజా వివాదం చోటు చేసుకుంది. న‌టి క‌రాటే క‌ల్యాణి, మ‌రో ఇద్ద‌రు క‌లిసి యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డిపై దాడికి దిగిన‌ట్టుగా తెలుస్తోంది.

ముందు క‌రాటే క‌ల్యాణి, యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డి మ‌ధ్య మాట‌ల యుద్ధం స్టార్ట్ కాగా ఆ వెంట‌నే ఒక‌రిపై ఒక‌రు చేయి చేసుకోవ‌డంతో గోడ‌వ మ‌రింత ముదిరింది. ప్ర‌స్తుతం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్న త‌రువాత ఇద్ద‌రు ఎస్‌.ఆర్. న‌గ‌ర్ పోలీస్టేష‌న్ లో ప‌ర‌స్ప‌రం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌కాంత్ రెడ్డి యూట్యూబ్ ఛాన‌ల్ ని నిషేధించాల‌ని క‌ల్యాణి డిమాండ్ చేశారు. ఇదే క్ర‌మంలో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి అకార‌ణంగా దాడి చేసిన క‌రాటే క‌ల్యాణిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శ్రీ‌కాంత్ రెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...