English | Telugu
Jayam serial: గంగని ఫాలో చేసి అంతా వీడియో తీసిన ఇషిక.. దొరికేసిందా!
Updated : Oct 6, 2025
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -76 లో... గంగని ఇంట్లో నుండి పంపిస్తానని శకుంతల చెప్పగానే.. మీ నిర్ణయానికి అడ్డు చెప్తున్నానని అనుకోవద్దు పెద్దమ్మ.. గంగ మన బాధ్యత.. తనని ఎక్కడికి పంపించడం నాకు ఇష్టం లేదని రుద్ర అంటాడు. నా నిర్ణయం కూడా అదే అని పెద్దసారు అంటాడు. మరొకవైపు చిట్టి పార్క్ లో ఆడుకుంటుంటే.. తన బాల్ పారు దగ్గరికి వెళ్తుంది. ఆ బాల్ ని పారు కోపంగా తన్నేస్తుంది.
చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఆలా చేస్తున్నావ్ కనీసం సారీ కూడా చెప్పడం లేదని పారిజాతంతో చిట్టి అంటుంది. దాంతో పారు చిట్టీని కొట్టబోతుంటే వాళ్ళ మేడం ఆపుతుంది. వాళ్ళ మేడమ్ ని పారు కొడుతుంది. గన్ తో బెదిరిస్తుంది. దాంతో భయపడి అందరు పారిపోతారు. మరొకవైపు శకుంతల అన్న మాటలు గుర్తుచేసుకొని రుద్ర బాధపడుతుంటే చిన్ని ఫోన్ చేసి జరిగింది చెప్పి రమ్మంటుంది. అదంతా ఇషిక వింటుంది. రుద్ర బయల్దేరి పోతుంటే గంగని అక్కడికి పంపించాలనుకుంటుంది ఇషిక. ఫోన్ లో తన భర్తతో మాట్లాడినట్లు యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు రుద్ర బావ రిలాక్స్ అవ్వడనికి పార్క్ కి వెళ్లాడా అని గంగకి వినిపించేలా మాట్లాడుతుంది. గంగ అది విని రుద్రతో మాట్లాడొచ్చు అని వెళ్తుంది. గంగ వెళ్లడం ఇషిక వీడియో తీస్తుంది.
గంగ వెళ్లేసరికి అక్కడ పారు ఉంటుంది. గంగ నర్స్ వేషంలో లేదు కాబట్టి పారు మొదటగా గుర్తుపట్టదు. గంగ వెళ్లి నర్స్ గెటప్ వేసుకొని వస్తుంది. అదంతా కూడా ఇషిక వీడియో తీస్తుంది. తరువాయి భాగంలో గంగ అందరిని మోసం చేస్తుందని ఇంట్లో అందరికి తాను తీసిన వీడియో చూపిస్తుంది ఇషిక. గంగ కూడా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.