English | Telugu

అన‌సూయ‌తో హైప‌ర్ ఆది ప‌దివేల పూజ.. ఏంట‌ది?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తోంది. ఇందులో వెయ్యి రూపాయ‌ల పూజ అంటూ హీరో, అత‌ని అసిస్టెంట్ చేసే హంగామా న‌వ్వులు పూయించింది. ఇదే స్క్రిట్ ని జ‌బ‌ర్ద‌స్త్ షో లో చేస్తే... ఇదే అద‌నుగా భావించి హైప‌ర్ ఆది అన‌సూయ‌పై పంచ్ లేస్తే... ఎలా వుంటుందో జ‌బ‌ర్ద‌స్త్ షో చూడాల్సిందే. ఇందులో హైప‌ర్ ఆది.. ఆనసూయ‌తో చేసే ప‌దివేల పూజ ఏంట‌న్న‌ది స‌స్పెన్స్...

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ ... హాస్య ప్రియుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న ఈ షో ప్ర‌తీ వారం న‌వ్వులు పూయిస్తోంది. రోజా, మ‌నో జ‌డ్జెస్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా హోస్ట్ గా అన‌సూయ వ్య‌వ‌హ‌రిస్తోంది. తాజా ఎపిసోడ్ ఈ నెల 20న ప్ర‌సారం కాబోతోంది. రీసెంట్ గా ఈ షో లేటెస్ట్ ప్రోమోని నిర్వాహ‌కులు విడుద‌ల చేశారు. ఇదిప్పుడు నెట్టింట సంద‌డి చేస్తోంది. తాజా షోలో హైప‌ర్ ఆది వ‌న్ మ్యాన్ షో గా మారిపోయింది. `పుష్ప‌` థీమ్ ని స్కిట్ గా మార్చుకుని ఆది పుష్ప‌రాజ్ గా మారిపోయాడు. ఇక్క‌డ శ్రీ‌వ‌ల్లిగా అన‌సూయ‌ని ఊహించుకోవ‌డంతో స్క్రిట్ ఓ రేంజ్ లో పేలింది.

స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా హైప‌ర్ ఆది .. అన‌సూయ‌పై పంచ్ లు వేయ‌డం అల‌వాటు. అదే అల‌వాటుతో తాజా ఎపిసోడ్ లోనూ అన‌సూయ‌పై పంచ్ లేశాడు. అన‌సూయ‌ని ఉద్దేశిస్తూ హైప‌ర్ ఆది వేసిన పంచ్ లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. `పుష్ప‌`లోని క్యారెక్ట‌ర్ ల‌ని రీ క్రియేట్ చేస్తూ ఓ స్కిట్ చేశారు. ఇందులో హైప‌ర్ ఆది పుష్ప‌రాజ్ గా క‌నిపించాడు. రావ‌డం రావ‌డ‌మే అన‌సూయ‌పై పంచ్ లు వేయ‌డం మొద‌లు పెట్టాడు.

Also Read:రష్మీ ఊ.. అంటే ఊహూ.. అంటారా?

అన‌సూయ సూత్తాందిరా.. అరేయ్ న‌వ్వుతుండాదిరా... అని హైప‌ర్ ఆది అన‌గానే `పుష్ప‌`లో బ‌న్నీకి అసిస్టెంట్ గా న‌టించిన వ్య‌క్తి `అట్టుంట‌ది వెయ్యి రూపాల పూజంటే అంటాడు. వెంట‌నే ఆది ` నాకు తెలుసురా అమ్మి న‌న్ను ల‌వ్‌సేత్తాంద‌ని.. వెయ్యి రూపాయ‌ల పూజ కాదుగానీ.. ఒక ప‌దివేలు పోతే పోయిన‌యిగానీ పెద్ద పూజ ఏదైనా వుంటే ప్లాన్ చెయ్ రా.. అని హైప‌ర్ ఆది అన‌గానే అన‌సూయ హావ‌భావాలు చూడాలి స్పీచ్ లెస్‌... ఈ నెల 20న ప్ర‌సారం కానున్న ఈ ఎపిసెడ్ కు సంబంధింన తాజా ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది. హైప‌ర్ ఆది, అన‌సూయ‌ల హంగామా చూడాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...