English | Telugu

జ‌బ‌ర్ద‌స్త్‌కి బిగ్‌ షాక్‌.. రోజా దారిలో అత‌ను కూడా!

గ‌త కొంత కాలంగా బుల్లితెర వీక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటున్న కామెడీ షో 'జ‌బ‌ర్ద‌స్త్‌'. న‌వ్వులు పూయిస్తూ కంటెస్టెంట్ ల స్కిట్ ల‌తో హాస్య ప్రియుల‌కు కావాల్సిన వినోదాన్ని అందిస్తూ వ‌స్తోంది. బుల్లితెర కామెడీ షోల్లో టాప్ రేటింగ్ తో సాగుతూ ఎంతో మందికి అవ‌కాశాల్ని అందిస్తూ వారిని స్టార్లుగా మార్చి పాపులారిటీని అందించింది. అలాంటి షో ప్ర‌స్తుతం ఆ ప‌ట్టుని కోల్పోతున్న‌ట్టుగా తెలుస్తోంది. త‌న వైభ‌వాన్ని కోల్పోతున్న‌ట్టుగా ఒక్కొక్క‌రు ఈ షో నుంచి వెళ్లిపోతున్నారు. గ‌త కొన్నేళ్లుగా టాప్ రేటింగ్ తో సాగుతున్న ఈ షో ఇప్ప‌డు ఆ క్రేజ్ ని కోల్పోతోంది.

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తూ కంటెస్టెంట్ ల స్కిట్ ల‌తో న‌వ్విస్తూ గ‌త కొన్నేళ్లుగా విజ‌య‌వంతంగా సాగుతున్న జ‌బ‌ర్ద‌స్త్ షో కు కోట్ల‌ల్లో అభిమానులున్నారు. యూట్యూబ్ లో ఈ షోకు తిరుగేలేదు. రికార్డ్ స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ఎపిసోడ్ ప‌రంగా ఈటీవిలో టాప్ రేటింగ్ తో సాగుతున్న ఈ కామెడీ షో నుంచి ఇటీవ‌ల మంత్రి రోజా నిష్క్ర‌మించిన విష‌యం తెలిసిందే. నాగ‌బాబు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన కాలం నుంచి ఈ షోకు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు రోజా.

ఇటీవ‌ల ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో జ‌బ‌ర్త‌స్త్ షోని ఆమె వీడాల్సి వ‌చ్చింది. ఆమె వెళ్లిపోవ‌డం జ‌బ‌ర్ద‌స్త్ కు బిగ్ షాక్ గా మారింది. టీమ్ లీడ‌ర్ లు స్కిట్ లు చేస్తుంటే మ‌ధ్య‌లో అదిరిపోయే పంచ్ లు వేస్తుంటారు రోజా. దీంతో మ‌రింత ఫ‌న్‌ జ‌న‌రేట్ అయ్యేది. ఇప్ప‌డు ఆ పంచ్‌లు వేసేవారు లేరు. ఇది ఈ షోకు పెద్ద లోటుగా మారింది. తాజాగా ఈ షోకు ఆయువు ప‌ట్టుగా నిలిచిన హైప‌ర్ ఆది కూడా బ‌య‌టికి వ‌చ్చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాల్లో వ‌రుస అవ‌కాశాలు, మ‌రో ఛాన‌ల్ కొత్త షోలో అవ‌కాశం రావ‌డంతో హైప‌ర్ ఆది జ‌బ‌ర్త‌స్త్ ని వీడిన‌ట్టుగా తెలుస్తోంది. ఇది నిజ‌మైతే ఈ షోకు బిగ్ షాక్ అని అంటున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...