English | Telugu

Eto Vellipoindhi Manasu: ఊహకందని మలుపులతో ఎటో వెళ్ళిపోయింది మనసు!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -222 లో....శ్రీవల్లి, సందీప్ లు బయటకు వెళ్లిపోతుంటే.. తప్పు చేసిన వాళ్ళు వెళ్తారు.‌ మీరెందుకని సీతాకాంత్ ఆపుతాడు. నేను తప్పు చేసానని అనుకుంటున్నారా అని రామలక్ష్మి అనగానే.. అది నీ మనసుకే తెలుసని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి బట్టలు సర్దుకుని వెళ్ళడానికి సిద్ధమవుతుంది.

రామలక్ష్మి వెళ్లిపోతుంటే సీతాకాంత్ సైలెంట్ గా ఉంటాడు. రామలక్ష్మి మళ్ళీ వెనెక్కి వచ్చి నన్ను క్షమించండి అని సీతాకాంత్ కాళ్ళపై పడుతుంది రామలక్ష్మి. నేను ఏ తప్పు చెయ్యలేదు.. ఏం చేసిన మీ కోసమే చేసానని అంటుంది. రామలక్ష్మి ఎలాంటిదో మాకన్న నీకే తెలుసు.. తను పొరపాటు అయిందని అంటుంది కదా క్షమించు అని పెద్దాయన అంటాడు. వదిన ఇది వరకు చాలాసార్లు నీకోసం చేసింది. నగల విషయంలో తన తప్పు లేదని సందీప్ అన్నయ్యదే తప్పని ఋజువు చేసింది. అలాంటిది అప్పుడు సందీప్ అన్నయ్య వెళ్ళాలని సిరి అంటుంది. రామలక్ష్మి వల్ల నా తల్లి బాధపడింది. తన కాళ్ళ ఫై క్షమించమని అడగాలని సీతాకాంత్ అనగానే రామలక్ష్మి వెళ్లి శ్రీలతకి సారీ చెప్తుంది. ఇప్పుడు ఇంకా రామలక్ష్మిని పంపించమని అంటే నేనే బ్యాడ్ అవుతానని శ్రీలత అనుకొని.. రామలక్ష్మి, సీతాకాంత్ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నానని శ్రీలత అంటుంది.

ఆ తర్వాత మాణిక్యం వెళ్తుంటే రామలక్ష్మి వచ్చి.. ఎందుకు నాన్న అంత నీపై వేసుకున్నావని అడుగుతుంది. నీ కాపురం బాగుండాలని అలా చేశానని మాణిక్యం అంటాడు. ఇప్పుడు మా అత్తయ్య గురించి మొత్తం తెలిసింది.‌ ఇక ఈ రామలక్ష్మి ఇప్పటి నుండి మరొక రామలక్ష్మి చూడాలని అంటుంది. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి రామలక్ష్మి వెళ్లి ప్లాన్ ఫెయిల్ అయిందని అనుకుంటున్నావా అంటూ తనకి కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత శ్రీలతకి.. రౌడీతో ఉన్న ఫోటోస్ పంపిస్తారు.‌ అది చూసిన శ్రీలత.. సందీప్ ని పిలుస్తుంది. సందీప్ అవి చూసి షాక్ అవుతాడు. అప్పుడే నందిని ఫోన్ చేసి.. మీరు చేసిన తప్పు బయటపడకుండా ఉండాలంటే.. వెంటనే మీరిద్దరు నా దగ్గరికి రండి అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...