English | Telugu

ఆదిత్య రావ‌డం దేవి గ‌మ‌నించిందా?



గ‌త ఎపిసోడ్ లో మాధ‌వ వెళ్ల‌గానే ఇంటికి వ‌చ్చిన ఆదిత్యతో రాధ మీరు ఎవ‌రు అస‌లు? దేవిపై మీకున్న హ‌క్కు ఏంటీ? అని నిల‌దీయ‌డంతో పాటు దేవితో కూడా `మీరు నా కోసం రావ‌ద్దు సారు` అని చెప్పించి షాకిస్తుంది. దాంతో ఆదిత్య గుండెలు ప‌గిలేలా ఏడుస్తాడు. మంగ‌ళ‌వారం ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌బోతోంది. ఈ రోజు 44వ ఎపిసోడ్ ప్ర‌సారం కాబోతోంది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో.. ఏం జ‌ర‌గ‌బోతోంద‌న్న‌ది ఒక‌సారి చూద్దాం.

Also Read:బెడిసికొట్టిన లాస్య ప్లాన్‌! ప్రేమ్‌-శ్రుతి శోభ‌నం!!

ఆదిత్య బాధ‌ప‌డ‌టం గ‌మ‌నించిన రాధ కూడా లోలోన కుమిలిపోతుంది. త‌న అంత‌రాత్మే త‌న‌కు క‌నిపించి ఆదిత్య‌ని ఎందుకు ఇలా బాధ‌పెడుతున్నావ్‌` అని నిల‌దీస్తే .. `నిజం తెలిస్తే నా చెల్ల‌ల బ‌తుకు ఆగ‌మ‌యితాది` అని ఏడుస్తుంది. ఇక సీన్ క‌ట్ చేస్తే.. మ‌రునాడు ఉద‌యాన్నే భోగి మంట‌లు వేసిన దేవుడ‌మ్మ కుటుంబం ఆదిత్య‌తో క‌లిసి సంబ‌రాలు చేసుకుంటారు. అప్పుడు కూడా ఆదిత్య దేవి గురించే బాధ‌ప‌డుతూ వుంటాడు. అక్క‌డ భోగి మంట‌లు అయ్యాక ఆదిత్య చాటుగా మాధ‌వ ఇంటికి వ‌చ్చి .. దూరం నుంచి దేవిని చూసుకుని మురిసిపోతాడు. కానీ దేవికి ఆదిత్య వ‌చ్చిన విష‌యం తెలిసిపోతుంది. ఇక్క‌డే ఎక్క‌డో వున్నాడ‌ని వెతుకుతూ వుంటుంది.

క‌ట్ చేస్తే... ఇక కాసేప‌టికి మాధ‌వ పిల్ల‌ల‌కి కొత్త బ‌ట్ట‌లు తెచ్చి.. పిల్ల‌ల‌కి వేయ‌మ‌ని రాధ‌కు ఇస్తాడు. చిన్మ‌య్ వేసుకుంటుంది కానీ దేవి మాత్రం తాను వేసుకోన‌ని ఖ‌రాకండీగా చెప్పేస్తుంది. దాంతో రామ్మూర్తి `పండ‌గ పూట కొత్త బ‌ట్ట‌లు వేసుకోకుండా చేశావ్ క‌ద‌రా.. ఇప్పుడు నీకు సంతోష‌మా? అని తిడ‌తాడు. కానీ మాధ‌వ మాత్రం `అంద‌రి మంచి కోస‌మే నేను అలా చేశాన‌ని చెబుతాడు. క‌ట్ చేస్తే ఆదిత్య ఇంట్లో కూర్చుని దేవి గురించి ఆలోచిస్తుంటాడు. అది గ‌మ‌నించిన స‌త్య ఏం చేసింది? ఆ త‌రువాత ఏం జ‌రిగింది అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...