English | Telugu

Brahmamudi : స్వప్న ముందు యాక్ట్ చేసిన రాహుల్.. రుద్రాణి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -875 లో...... రాహుల్ ఇంటికి వచ్చాక అందరు తిడుతారు. ఇప్పటికైనా మనిషి లాగా మారు అని అంటారు. నేను మారుతానని స్వప్నకి రాహుల్ మాటిస్తాడు. ఇంత పెద్ద కుటుంబంలో ఎవరు తప్పు చేసిన అది అందరికి శిక్షే. నువ్వు మారావు అని మాటలతో కాదు నిరూపించు అని స్వప్న చెప్తుంది.

ఆ తర్వాత రాహుల్ దగ్గరికి రుద్రాణి వెళ్లి.. ఏంట్రా అందరి ముందు తప్పు చేసినవాడిలా తలదించుకుంటున్నావ్.. ఆ తప్పు చేయడానికి ఇంట్లో వాళ్లే కారణం కదా. నువ్వు మారడం ఏం అవసరం లేదు.. నేనున్నా కదా.. నన్ను ఫాలో అవ్వు.. నేను చూసుకుంటానని రుద్రాణి అంటుంది. లేదు మమ్మీ నేను తప్పు చేసానంటే అందరు నమ్మారు రాజ్, కావ్య నమ్మలేదు.. నన్ను బయటకు తీసుకొని వచ్చారు. ఇకనైనా మారాలని రాహుల్ అంటాడు‌. అదంతా దూరం నుండి స్వప్న వింటుంది. రాహుల్ మారిపోయాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కావ్య తనకి ఇష్టమైనవి చేయాలని రాజ్ తో చెప్తుంది. ఇప్పుడు చికెన్ తినాలని ఉంది అంతే కదా సరే చేసి పెడతానని కిచెన్ లోకి వెళ్లి టార్చు ఆన్ చేసి వంట చేస్తాడు.

లైట్ వేసుకోవచ్చు కదా అని కావ్య అంటుంది. లైట్ వేస్తే అందరికి తెలిసిపోతుంది. ఇంట్లో వాళ్ళు వచ్చి ఎగబడి తినేస్తారని రాజ్ అంటాడు కానీ అప్పటికే ఇంట్లో వాళ్ళు అందరు రాజ్ మాటలు విని కోపంగా ఉంటారు. వాళ్ళని రాజ్ చూసి షాక్ అవుతాడు. తరువాయి భాగంలో కంపెనీలో ఫ్రాడ్ చేస్తే డబ్బు ఇస్తానని ఒకతను రాహుల్ దగ్గరికి వచ్చి డబ్బు ఆఫర్ చేస్తే చెయ్యనని రాహుల్ అంటాడు. అది చూసి రాహుల్ మారిపోయాడని స్వప్న అనుకుంటుంది. ఎలా ఉంది మమ్మీ నా యాక్టింగ్ ఇదంతా నా భార్య దృష్టిలో నమ్మకం కలిగేలా చెయ్యడానికి అని రాహుల్ అనగానే రుద్రాణి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...