English | Telugu

Brahmamudi : కోయిలి నిజస్వరూపాన్ని రాహుల్ కు చూపించిన రాజ్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -871 లో.....గోల్డ్ బాబూ కోసం కోయిలి పార్టీ ఏర్పాటు చేస్తుంది. గోల్డ్ బాబుతో కలిసి డ్రింక్ చేస్తూ డాన్స్ చేస్తుంది. అదంతా రాహుల్ చూసి.. నువ్వేం చేస్తున్నావ్.. నీకు అర్థం అవుతుందా అని కోప్పడుతాడు. గోల్డ్ బాబుని సంతోషపరచాలి కదా అని కోయిలి అంటుంది. నువ్వు వాడితో కాదు నాతో డాన్స్ చేయాలని రాహుల్ కోపంగా కోయిలిని తన వైపుకి లాగుతాడు.

నాకూ బోరింగ్ గా ఉంది.. నేను వెళ్ళిపోతానని గోల్డ్ బాబూ అంటాడు. దాంతో రాహుల్ ని వదిలేసి కోయిలి, గోల్డ్ బాబూ దగ్గర కి వెళ్లి డాన్స్ చేస్తుంది. రాహుల్ ని ఇద్దరికి డ్రింక్ కలిపి ఇవ్వమని చెప్తుంది. దాంతో రాహుల్ కోపంగా డ్రింక్ కలిపి వాళ్ళిద్దరికి ఇస్తాడు. ఆ తర్వాత సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తారు.. రాజ్, కావ్య ఇద్దరు డాన్స్ చేస్తారు మీరు ముసలి వాళ్ళు కదా అని కోయిలి అడుగుతుంది. మేమ్ ముసలి వాళ్ళమే అని మళ్ళీ ముసలి వాళ్ళలాగా యాక్టింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత కోయిలి తన గదిలో పడుకుంటుంది. రాజ్, కావ్య ఇద్దరు గోల్డ్ బాబూ దగ్గరికి వెళ్లి నువ్వు ఇక్కడ పడుకున్నావేంటీ వెళ్లి కోయిలి గదిలో పడుకోమని పంపిస్తారు.

గోల్డ్ బాబూ వెళ్లి కోయిలి పక్కన పడుకుంటాడు. తన షర్ట్ కి లిప్ స్టిక్ మార్క్ పెట్టుకుంటాడు. ఉదయం రాజ్, కావ్య ఇద్దరు రాహుల్ దగ్గరికి వెళ్లి కొయిలిని గోల్డ్ బాబూ గదిలో చూసామని చెప్తారు. దాంతో రాహుల్ వెళ్లి చూడగా గోల్డ్ బాబు పక్కన కోయిలి ఉండడం చూసి షాక్ అవుతాడు. చూసావా ఇది ఏలాంటిదో.... అది కేరాఫ్ ఫ్లాట్ ఫామ్.. అది కోటీశ్వరురాలు కాదని రాహుల్ తో రాజ్ చెప్తాడు. తరువాయి భాగంలో దుగ్గిరాల ఇంటికి పోలీసులు వస్తారు.. రాహుల్ ని అరెస్ట్ చెయ్యాలి.. కోయిలి అనే అమ్మాయిని హత్య చేసాడని పోలీసులు చెప్తారు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.