English | Telugu

Brahmamudi : అత్త నాటకం తెలుసుకున్న అల్లుడు.. దాంపత్య పూజ నుండి లేచి వెళ్లిపోయాడుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -543 లో.....కావ్య, నేను దాంపత్య పూజలో కూర్చోనని చెప్పి వెళ్తుంది. దాంతో కనకం పక్కకు వచ్చి తన నటన మొదలుపెడుతుంది. అప్పుడే రాజ్ వస్తాడు. నాకు సంతోషపడే అదృష్టం లేదు.. మీరేం చేస్తారని కనకం అంటుంది. నేను ఒప్పిస్తానంటూ కావ్య దగ్గరికి రాజ్ వెళ్తుంటే.. ఇగోకి పోకుండా కావ్యని ఒప్పుకునేలా చెయ్యమని అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు చెప్తారు.

ఆ తర్వాత నీతో మాట్లాడాలంటూ కావ్యని రాజ్ పక్కకి తీసుకొని వెళ్తాడు. పూజలో కూర్చవాలని చెప్తాడు. ఏ అర్హతతో కూర్చోవాలి మీ భార్యగానా.. కనకం కూతురిగానా.. దుగ్గిరాల కోడలుగానా అని కావ్య అడుగుతుంది. నా భార్యగా కూర్చో.. మీ అమ్మ కోసమో, మా అమ్మ కోసమో కాదు..మన గురించి మన జీవితం గురించి, ఇక నేను చెప్పను నీ ఇష్టమని రాజ్ అంటాడు. అదంతా అపర్ణ, ఇందిరాదేవి, కనకంలు చూస్తుంటారు. ప్లాన్ సక్సెస్ అనుకుంటారు. ఆ తర్వాత అప్పు గదిలో ఉన్నది చూసుకోకుండా.. పెద్దమ్మ అనుకున్నది చేసిందని బంతి అంటాడు. అది అప్పు విని ఏంటి అది అని బంతిని బెదిరిస్తుంది. పెద్దమ్మ కావ్య అక్కని బావని కలపడానికి తనకి క్యాన్సర్ అని డ్రామా ఆడుతుందని చెప్తాడు. ఈ విషయం బావకి తెలిస్తే పరిస్థితేంటి.. ఎవరికీ ఈ విషయం చెప్పకంటూ అప్పు అంటుంది. అదంతా రుద్రాణి వింటుంది.

ఆ తర్వాత ముగ్గురు అల్లుళ్ళు పూజలో కూర్చొని ఉంటారు. స్వప్న, అప్పులు కూర్చొని.. కావ్య కోసం చూస్తుంటారు. అప్పుడే కావ్య వచ్చి పూజలో కూర్చుంటుంది. పూజ జరుగుతుండగా. తల్లి కూతుళ్ల నటన సూపర్ అంటుంది. ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని అపర్ణ అనగానే.. నాటకం ఇక్కడ అయితే అక్కడికి వెళ్లి ఎందుకు మాట్లాడుకోవడమని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో కనకం ఆడింది నాటకమని రాజ్ కి తెలుస్తుంది. తల్లితో కలిసి కూతురు కూడా బాగా నటించింది. ఇక జీవితంలో కావ్యని, ఆమె కుటుంబాన్ని నమ్మనని రాజ్ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.