English | Telugu

Brahmamudi : కోమాలోకి వెళ్లిన అపర్ణ.. కావ్యను ఇంట్లో నుండి గెంటేయ్ రాజ్

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -510 లో.... అపర్ణ ఎప్పటిలాగే టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకుంటుంది. మరొకవైపు ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని ఫోన్ వచ్చిందని కావ్య ఆఫీస్ కి వెళ్లి అక్కడ మేనేజర్ ని అడుగుతుంది. మేం ఏం చెయ్యలేదని అతను చెప్పగానే తనకి వచ్చిన నెంబర్ కి కాల్ చేస్తుంది. ఫోన్ కలవదు ఒకసారి అన్ని ఫైల్స్ చెక్ చెయ్యాలని కావ్య అంటుంది. మరోకవైపు అపర్ణకి బీపీ ఎక్కువ అవుతుంది. దాంతో కావ్యకి ఫోన్ చేస్తుంది. తను లిఫ్ట్ చెయ్యదు. ఆ తర్వాత అంత బాధలో కూడ రాజ్ కి చేసి నాకు ఇబ్బందిగా ఉంది రా త్వరగా అంటూ చెప్తుంది.

అసలు ఏమైంది అమ్మకి ఆలా మాట్లాడింది అంటూ రాజ్ తో సహా అందరు ఇంటికి వెళ్తారు. అక్కడ కింద పడిపోయి ఉన్న అపర్ణని చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. కార్ లో కావ్య ఇంటికి వస్తుంటే రాజ్ వాళ్ళు బయటకు వెళ్తారు. అపర్ణ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాక కావ్య నేను చూసుకుంటానంటే వదిలి వెళ్ళాం.. అసలు కావ్య ఎక్కడికి వెళ్ళిందని ఇందిరాదేవి అంటుంది. అప్పుడే అత్తయ్యకి ఏమైంది అంటు కావ్య అడుగుతుంది. రాజ్ కోపంగా ఎక్కడికి వెళ్ళావ్.. మా అమ్మకి ఏమైనా అయితే చంపేస్తానని కావ్యపై రాజ్ కోప్పడతాడు. ఆ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి బీపీ ఎక్కువ అయింది. కోమాలోకి వెళ్ళింది. ట్రీట్ మెంట్ కీ రెస్పాండ్ అయితే గానీ ఏం చెప్పలేమని డాక్టర్ అనగానే మీరు అలా అనకండి మా అమ్మ ని కాపాడండి అంటూ డాక్టర్ పై రాజ్ అరుస్తాడు.

ఆ తర్వాత అందరూ వెళ్లిపోండి.. ఇక్కడ మా డాడ్ నేను ఉంటామని రాజ్ అంటాడు. అందరు ఇంటికి వెళ్తారు. అపర్ణని రాజ్ చూస్తూ ఎమోషనల్ అవుతాడు. మరొకవైపు కళ్యాణ్ కి అపర్ణ హాస్పిటల్ లో ఉందని తెలిసి హాస్పిటల్ కి వస్తాడు. అమ్మకి ఏం కాదు రేపు చూడు ఎలా మాట్లాడుతుందోనని అంటాడు. ఎవరిని నమ్మొద్దు అమ్మని మనలాగా ఎవరు చూసుకోలేరు భార్యని కుడా నమ్మొద్దంటు కోపంతో కూడిన ప్రేమతో రాజ్ మాట్లాడతాడు. తరువాయి భాగంలో ఆఫీస్ లో ఫ్రాడ్ జరుగుతుందని ఫోన్ వస్తే వెళ్ళానని కావ్య అనగానే.. జరిగితే నీకెందుకు మా అమ్మకి ఏదైనా అవ్వాలి.. నిన్ను జన్మలో క్షమించనని రాజ్ అంటాడు. ఏదో జరిగే వరకు ఎందుకు ఈ దరిద్రాన్ని ఇప్పుడే ఇంట్లో నుండి గెంటేయ్ రాజ్ అని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...