English | Telugu
Brahamamudi : ఊహకందని ట్విస్ట్ లతో సాగుతున్న బ్రహ్మముడి!
Updated : Sep 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -507 లో......రాహుల్ ఏ తప్పు చెయ్యలేదని పోలీసులు రాహుల్ ని మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు. దాంతో రుద్రాణి రెచ్చిపోతు.. నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదు విడిపించండని చెప్పినా కూడా ఎవరు నమ్మలేదు.. అసలు పట్టించుకోలేదని అందరిని కలిపి రుద్రాణి తిడుతుంటే.. ఆపండి రుద్రాణి గారు బయటకు వచ్చినంత మాత్రాన ఏ తప్పు చెయ్యలేదని కాదు.. తప్పు చేసాడని నేను నిరూపస్తానని కావ్య అనగానే రాహుల్ షటప్ అని గట్టిగా అరుస్తాడు.
ఇప్పటి వరకు చేసిన ఫేక్ అలిగేషన్ లు చాలని కావ్యపై రాజ్ కోప్పడుతాడు. సారీ అత్త అని రుద్రాణికి రాజ్ చెప్తాడు. సారీ రాహుల్ అనగానే.. నన్ను అందరు ఒక దోషిలాగా చూసారు.. అత్తయ్య నన్ను కొట్టింది.. ఇక ఇంత జరిగాక నేను ఆఫీస్ కి వెళ్ళనని రాహుల్ కోపంగా వెళ్ళిపోతాడు. కంపెనీకీ పట్టిన దరిద్రం పోయింది.. నువ్వు అనవసరంగా ఫీల్ కాకు రాజ్ అని స్వప్న అంటుంది. ఆ తర్వాత సీతారామయ్య రాజ్ ని పిలిపిస్తాడు. నాకు ఎందుకో ఈ కుటుంబం ముక్కలు అవుతుందనిపిస్తుంది. ఆ రోజు ధాన్యలక్ష్మి ఆస్తులు ముక్కలు చెయ్యాలన్నప్పుడు నాకు బాధేసిందని సీతారామయ్య అనగానే.. మీరేం టెన్షన్ పడకండి తాతయ్య.. కుటుంబం ముక్కలు కాకుండా నేను చూసుకుంటానని సీతారామయ్యకి రాజ్ మాటిస్తాడు. ఆ తర్వాత ఇదంతా నువ్వే చేసావ్ కదరా.. అసలు ఎలా తప్పించుకున్నావని రాహుల్ ని రుద్రాణి అడుగుతుంది. ఇలాంటి సిచువేషన్ వస్తే ఏం చెయ్యాలో ముందే ఒకడిని సెటిల్ చేశా.. వాడు ఇప్పుడు నేనే చేసానంటూ వచ్చాడని రాహుల్ అనగానే.. ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావని రుద్రాణి మురిసిపోతుంది.
ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. ఇక నుండి నువ్వేం చేసిన నాకు చెప్పు.. నీవల్ల ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారని కావ్యకి రాజ్ చెప్తాడు. మరొకవైపు కళ్యాణ్ నిద్రపోతు అప్పు పక్కన లేకపోవడం గమనిస్తాడు. దాంతో కళ్యాణ్ టెన్షన్ పడుతాడు. అప్పుడే అప్పు పిజ్జా డెలివరీ చేసి వస్తుంది. ఇలా రాత్రి చెప్పకుండా వెళ్తావా అంటు కోప్పడతాడు. ఆ తర్వాత కళ్యాణ్ ని అప్పు కళ్ళు మూసుకోమని చెప్పి.. కేక్ తీసుకొని వచ్చి ఆతనికి సర్ ప్రైజ్ ఇస్తుంది. బర్త్ డే కీ గిఫ్ట్ కూడా ఇస్తుంది. అది అతను కవితలు రాసేందుకు ఉపయోగపడుతుందని చెప్తుంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని అప్పుని హగ్ చేసుకుంటాడు కళ్యాణ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.