English | Telugu
నామినేషన్స్ లో బిందు బాత్రూమ్ టాపిక్
Updated : Apr 26, 2022
బిగ్‌బాస్ నాన్ స్టాప్ నామినేషన్స్ రచ్చ మళ్లీ మొదలైంది. అయితే ఈ సారి జరిగిన 9వ వారం నామినేషన్స్ ప్రక్రియ మాత్రం మరీ దారుణంగా వుంది. వ్యక్తిగత దూషణలతో పాటు బిందు మాధవి బాత్రూమ్ రచ్చ ఓ రేంజ్ లో నామినేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. ఇంటి సభ్యులందరూ వారు నామినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరు సభ్యుల దిష్టిబొమ్మలపై ఒక్కో కుండని పెట్టి తగిన కారణాలు చెప్పిన తరువాత ఆ కుండను పగలగొట్టాల్సి వుంటుంది అంటూ 9వ వారం నామినేషన్స్ టాస్క్ ని బిగ్‌బాస్ ప్రారంభించాడు.
ముందుగా రంగంలోకి దిగిన శివ.. నటరాజ్ మాస్టర్ దిష్టిబొమ్మపై కుండని బోర్లించి పగలగొట్టేశాడు. ఈ సమయంలోఒ ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. నేను కెప్టెన్ గా వున్నప్పుడు మీదమీదకొచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకోసారి మీద మీదకొచ్చి మాట్లాడకూడదని నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు శివ. దీంతో తను చెప్పిన రీజన్ కు ఆగ్రహించిన నటరాజ్ మాస్టర్ ఓ రేంజప్ లో శివకు క్లాస్ పీకాడు. నువ్వు కెప్టెన్ కాకపోతే ఏం చేసినా చెల్లుద్ది.. అంటూ సీరియస్ అయ్యాడు.
ఆ తరువాత లైన్ లోకి వచ్చిన అఖిల్ .. అంతా అనుకున్నట్టే శివని నామినేట్ చేయడానికొచ్చాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పెద్ద రచ్చే జరిగింది. సెకండ్ టైమ్ వచ్చింది రిమార్క్ లు తీసుకోవడానికి కాదు అంటూ అఖిల్ రెచ్చిపోయాడు.. `అసలు నామినేషన్స్ పాయింట్ లో అమ్మాయి బాత్రూమ్ టాపిక్ ఎత్తడమే ..అంటూ శివ .. అఖిల్ ని రెచ్చగొట్టాడు.. దీంతో అఖిల్ ..ఆగూ వద్దూ.. నాదగ్గరొద్దూ అంటూ అరిచాడు. శివ కూడా తానేమీ తక్కువ కాదు అన్నట్టుగా నాదగ్గర కూడా వద్దు అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీంతో అఖిల్ సైలెంట్ అయిపోయాడు. ఇక అరియానా - నటరాజ్.. అరియానా - హమీదాల మధ్య జరిగిన నామినేషన్స్ ఓ రేంజ్ లో హౌస్ ని హీటెక్కించేసింది.