English | Telugu

భార్య ఇచ్చిన సర్ ప్రైజ్ కి కంటతడి పెట్టుకున్న అవినాష్!

బిగ్ బాస్ హౌస్ లో ఓల్ట్ కంటెస్టెంట్స్ కి వైల్డ్ కంటెస్టెంట్స్ కి మధ్య గేమ్ సూపర్ గా సాగుతుంది. అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రేక్షకులందరిని తన వైపుకి తిప్పుకున్నాడు. తన స్పాంటేనియస్ కామెడి పంచులతో హౌస్ లో.. మరొక జబర్దస్త్ షో చూపిస్తున్నాడు. హెయిర్ కట్ ఛాలెంజ్ ని ఒప్పుకొని కట్ చేయించుకొని.. ప్రైజ్ మనీ ఫిఫ్టీ థౌజెండ్ ఆడ్ చేసి నాగార్జునతో ప్రశంసలు పొందాడు.

అంత డేర్ చేసి ఛాలెంజ్ ని ఒప్పుకున్నందుకు.. నీకొక సర్ ప్రైజ్ అంటూ నాగార్జున తన భార్య మాట్లాడిన ఆడియోని వినిపించాడు. అందులో ఏం ఉందంటే.. హ్యాపీ యానివర్సరీ అవి.. ఐ లవ్ యు ఎప్పుడు ఇలాగే కలిసి ఉందాం.. గేమ్ బాగా ఆడుతున్నావు.. ఇంకా బాగా ఆడు.. విన్నర్ అయి రావాలని ఉంటుంది. అది విని అవినాష్ ఎమోషనల్ అవుతాడు. తను కూడా లవ్ యూ టూ అను అంటూ గట్టిగా అరుస్తాడు. అవినాష్ ఎమోషనల్ అవుతుంటాడు. అందరిని నవ్విస్తాడు తను ఏడవడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా అని నయని అనగా.. వాళ్లకు మనసు ఉంటుంది కదా ఎమోషనల్ అవుతారని నాగార్జున అంటాడు. అవినాష్ ఉంగరాల జుట్టు అంటే వాళ్ళావిడకి చాలా ఇష్టం‌.. అయిన గేమ్ కోసం సాక్రిఫై చేసాడని నాగార్జున చెప్తాడు. అయిన ఇలా బాగున్నావ్ అవినాష్ అని నాగార్జున అనగానే.. అదే సర్ హౌస్ లో అమ్మాయిలు అందరు.. నా వైపే చూస్తున్నారని అవినాష్ కామెడి చేస్తాడు. కానీ గేమ్ మాత్రం ఇరగదీసావంటు అవినాష్ ని నాగార్జున పొగుడుతాడు.

ఆ తర్వాత బిబి హెడ్ లైన్స్ లో భాగంగా.. పైకి నవ్విస్తా వెనకాల ప్లాన్ వేస్తా అనే హెడ్ లైన్ అవినాష్ కి నాగార్జున ఇవ్వగా.. అందరు ఎస్ అనే చెప్తారు. టాస్క్ అది ఇలా.. ఇది ఇలా అంటూ తనే ప్లాన్ వేస్తాడని రోహిణి చెప్పుకొచ్చింది. ఈ టాస్క్ బిగ్ బాస్ సీజన్-4లో కూడా ఉంది సర్. అప్పుడు కూడా ఇలాగే తెలియకుండా ఛార్జింగ్ పెట్టుకున్నానంటూ గుర్తుచేసుకున్నాడు అవినాష్.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...