English | Telugu

ఊహించని విధంగా ఎలిమినేషన్.. ఇది నిజంగా అన్ ఫెయిర్!


బిగ్ బాస్ హౌస్ లో కొత్త నీరు వచ్చేస్తోంది. అందుకే పాతనీరుని పంపించేస్తున్నారు. అదే మిడ్ వీక్ ఎలిమినేషన్.. హౌస్ నుండి ఎవరు వెళ్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది.

నేటి ప్రోమో కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా శనివారం, సోమవారం నాటి ప్రోమోల కోసం బిబి ఆడియన్స్ ఎదురుచూస్తారు. కానీ ఓసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నారు కాబట్టి ఎవరు బయటకు వస్తారో తెలియదు‌. అయితే బిబి లీక్స్ ప్రకారం ఆదిత్య ఓం అని కొందరు నైనిక అని మరికొందరు అంటున్నారు. కానీ ఎవరు ఎలిమినేషన్ అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక తాజాగా బిగ్ బాస్ సెకెండ్ ప్రోమోని వదిలాడు. ' Unexpected Eviction ' అనే టైటిల్ తో రిలీజ్ చేసిన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మీలో ఒకరికి మాత్రం పీడకలలా మారనుంది. మీ బ్యాగ్స్ ని సర్దుకొని ఇంటి సభ్యులందరికి బై చెప్పేసి రెడీగా ఉండమని బిగ్ బాస్ నామినేషన్ లో ఉన్నవారికి చెప్పాడు. ఇక ఈ ప్రోమోని బట్టి చూస్తే నామినేషన్ లో మొత్తం ఆరుగురు ఉండగా.. వారిలో నిఖిల్, నబీల్, మణికంఠ సేవ్ అయ్యారని తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ చివరగా ఆదిత్య ఓం, నైనిక, విష్ణుప్రియ ఉన్నారు.

ఇక ఆ ముగ్గురిలో ఎవరిని హౌస్ నుండి బయటకు పంపించాలని అనుకుంటున్నారో హౌస్ మేట్స్ నే తగిన కారణాలు చెప్పమన్నాడు బిగ్ బాస్. ఇక ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్పగా.. చివరగా ఎవరు వెళ్తారో తెలియదన్నట్టుగా ఈ ప్రోమోని వదిలారు మేకర్స్. కిర్రాక్ సీత మాత్రం విష్ణుప్రియ, నైనిక ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్తారేమోనని ఏడుస్తూ కన్పించింది. ఆదిత్యని నిఖిల్, నైనికని పృథ్వీ ఇంటికి పంపించడానికి తమ నిర్ణయాలు చెప్పారు. ఇక హౌస్ లో మెజారిటీ ఎవరిని బయటకు పంపించాలని అనుకున్నారో తెలియాలంటే రాత్రి జరగబోయే ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...