English | Telugu

సెకెంఢ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ని రివీల్ చేసిన బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ఫుల్ ట్విస్ట్ లతో సాగుతుంది. ‌ఇక ఈ వీకెండ్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుంది. ఎవరు వస్తారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.

మొదటి వైల్డ్ కార్డ్ ఎవరో కనిపెట్టండి అంటూ టేస్టీ తేజని షాడోలో చూపించిన బిగ్ బాస్. ఇప్పుడు సెకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో కనిపెట్టండి అంటు ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఓ ఫోటోని షేర్ చేశాడు. షాడోలో ఉన్న ఆ ఫోటోని చూసిన వారంతా రోహిణి అని కనిపెట్టేశారు. అయితే అది చూసిన వారంతా రోహిణి అయితే కాదు.. అంటు ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఇదే పోస్ట్ కి గౌతమ్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు ‌. ఎవరు వచ్చినా రాకున్నా మా గౌతమ్ అన్న రావాలి.. వీ ఆర్ వెయిటింగ్ ఫర్ గౌతమ్ కృష్ణ అంటు కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పుడు వైల్డ్ కార్డ్ లిస్ట్ చూస్తే భారీగానే ఉంది. ఇక హౌస్ లో ఇప్పటికే కన్నడ బ్యాచ్ హవా సాగుతుంది. మరి వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్ళిన వాళ్ళు కన్నడ బ్యాచ్ కి ధీటుగా ఆడతారా లేక వాళ్ళలో కలిసిపోతారా అనేది కీలకంగా మారనుంది. రోహిణి మొదటగా సీరియల్స్ , ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయ్యింది. జబర్దస్త్ నుండి సేవ్ ది టైగర్స్ సిరీస్ లో నటించింది. అందులో తన కామెడీతో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చింది. మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అదే రేంజ్ లో కామెడీ ఇస్తుందా లేదా అనేది చూడాలి మరి.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...