English | Telugu

Bigg Boss 9 Telugu: టాస్క్ లో ఓడిన కళ్యాణ్.. కొత్త రాణిగా తనూజ!

బిగ్ బాస్ సీజన్-9 లో పదో వారం కెప్టెన్సీ టాస్క్ సాగుతోంది. ‌బీబీ రాజ్యం టాస్క్ లో రాజు, రాణులు, ప్రజలు అంటూ స్కిట్ తో పాటు మధ్యలో టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో మొన్నటి టాస్క్ లో దివ్య, రీతూ, నిఖిల్ ఉండగా.. ఆ తర్వాతి టాస్క్ లో దివ్య ఓడిపోయి కళ్యాణ్ గెలిచి రాజుగా ఎన్నికయ్యాడు.

నిన్నటి ఎపిసోడ్ మొదలవ్వగానే ఛెఫ్ మాస్టర్ తుమ్మ సంజయ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక వచ్చీ రాగానే హౌస్ లోని రాజులకి, రాణికి విందు ఏర్పాటు చేశాడు. వారికి తగి‌న మర్యాదలు చేశాడు. ఇక ఆ తర్వాత వంటల ఫెస్టివల్ తర్వాత హౌస్‌లో తిరుగుబాటు డ్రామా మొదలైంది. ప్రజలు.. రాజులు, రాణులపై వ్యతిరేకంగా నిలిచారు. కమాండర్‌లు తనూజ, సంజన కూడా తాము తక్కువ తినలేదని స్ట్రైక్ ప్రకటించారు. ఈ తిరుగుబాటుతో రాజులు షాక్‌కు గురయ్యారు. తర్వాత రాజులు, రాణి బతిమిలాడి కమాండర్‌లను, ప్రజలను మళ్ళీ తమవైపు తిప్పుకున్నాడు. తిరుగుబాటు వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడానికి రాజులు సుమన్, ఇమ్మనియెల్ ను పిలిపించుకున్నారు. వారిని విచారించి చేతులు కట్టేసి బంధించారు. డ్రామా పీక్ రీచ్ అయ్యింది — కొరడా దెబ్బలు వేసి కక్ష సాధింపు సీన్ తో హౌస్ మొత్తాన్ని ఉత్కంఠలో ఉంచారు. ఇంతటితో తిరుగుబాటు కథకు పర్ఫెక్ట్ ఎండ్ వచ్చింది.

ఆ తర్వాత తర్వాత ఇమ్యునిటీ టాస్క్‌గా “Place of Cubes” ను ప్రకటించారు. రాజులు, రాణులు కలిసి కల్యాణ్ ను తమ తరపున పోటీదారుగా ఎంపిక చేశారు. ఇక ప్రజలు.. కమాండర్‌ల నుండి తనూజ, దివ్య ను ఎంపిక చేశారు. రాజు తన స్థానాన్ని కాపాడుకోవడానికి, కమాండర్‌లు రాణి అవ్వడానికి ఈ పోటీ కీలకమైంది. దివ్య సంచాలకురాలిగా వ్యవహరించిన ఈ పోటీలో తనూజ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ఆమె కొత్త రాణిగా నిలిచింది. కల్యాణ్ మాత్రం కమాండర్‌గా మారాడు. ఈ ట్విస్ట్‌తో హౌస్‌లో కొత్త పవర్ బ్యాలెన్స్ ఏర్పడింది.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.