English | Telugu

Bigg Boss 9 Telugu Voting 13th week: డేంజర్ జోన్ లో‌ సుమన్ శెట్టి.. సంజన ఎలిమినేషన్!

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం వీకెండ్ కి వచ్చేసింది. ఇక ఈ వారం టికెట్ టూ ఫినాలే కోసం టాస్క్ లు జరుగగా అందులో పవన్ కళ్యాణ్ పడాల(Pawan Kalyan) గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు.‌ ఇక ఈ వారం హౌస్ లో కెప్టెన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ మినహా మిగిలిన ఆరుగురు నామినేషన్లో ఉన్నారు. ఇక వీరిలో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం.

సోమవారం మొదలైన నామినేషన్ ప్రాసెస్.. నిన్నటి శుక్రవారం అర్థరాత్రితో ముగిసింది.‌ ఇక ఇందులో ఎవరు టాప్ లో ఉన్నారో, ఎవరు లీస్ట్ లో ఉన్నారో చూద్దాం. ఇక ఓటింగ్ లైన్స్ పూర్తయ్యేసరికి తనూజ ఈజ్ అన్ టాప్. 28.56 శాతం ఓటింగ్ తో తనూజ ప్రథమ స్థానంలో నిలిచింది. 17.32 శాతం ఓటింగ్ తో రీతూ రెండో స్థానంలో ఉండగా, 16.13 శాతం ఓటింగ్ తో భరణి మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 15.39 శాతం ఓటింగ్ తో డీమాన్ పవన్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. ఇక డేంజర్ జోన్ లో సుమన్ శెట్టి, సంజన గల్రానీ ఉన్నారు.

పదకొండు శాతం ఓటింగ్ తో సుమన్ శెట్టి అయిదో స్థానంలో ఉండగా.. పది శాతం ఓటింగ్ తో సంజన గల్రానీ లీస్ట్ లో ఉంది. అంటే ఈ వారం ఎలిమినేషన్ వీరిద్దరిలోనే ఉండబోతుందన్నమాట. అయితే బిగ్ బాస్ మామ ట్విస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంజన, సుమన్ శెట్టి ఇద్దరికి బిగ్ బాస్ సపోర్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరికి సపోర్ట్ గా ఉంటే డీమాన్ పవన్ ఎలిమినేట్ అవుతాడు. లేదంటే సంజన ఎలిమినేషన్ కన్ఫమ్. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేషన్ అయ్యేది ఎవరో కామెంట్ చేయండి.