English | Telugu

Bigg Boss 9 Telugu Family Time: ఫ్యామిలీ వీక్ లో డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ఎమోషనల్!


బిగ్ బాస్ హౌస్ లో పదకొండవ వారంలో ఫ్యామిలీ వీక్ కొనసాగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో తనూజ సిస్టర్ ఇంకా సుమన్ శెట్టి వైప్ వచ్చి హౌస్ లో సందడి చేశారు. ఇక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో డీమాన్ పవన్ వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి అమ్మ అంటే ఒక స్పెషల్ ఎమోషన్ ఉంటుంది. ఇక కొన్ని రోజులపాటు అమ్మకి దూరంగా కనీసం మాట కూడా లేకుండా హౌస్ లో ఉంటారు కంటెస్టెంట్స్. మరి అలాంటి సిచువేషన్ లో హౌస్ లో వాళ్ల అమ్మని ఒక్కసారిగా చూడగానే ఆ ఫీలింగ్ వర్ణనాతీతం.

డీమాన్ పవన్ టాస్క్ ఆడి ఫ్యామిలీతో ఎంత టైమ్ స్పెండ్ చెయ్యాలో సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ చింటూ అంటూ హౌస్ లోకి వస్తుంది. దాంతో పవన్ ఎమోషనల్ అవుతాడు. రాగానే తనకోసం చేసుకొని తీసుకొని వచ్చిన సున్నుండ తినిపిస్తుంది. రీతూ తన దగ్గరికి వెళ్తుంది. తనకి కూడా తినిపిస్తుంది. ఇక పవన్ వాళ్ళ అమ్మ పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు. పవన్ తన ఆట గురించి ఆడి తెలుసుకుంటాడు. అంత బాగుందని వాళ్ళ అమ్మ చెప్తుంది. హౌస్ లో అందరితో వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది.

నాకు హౌస్ లో ఎవరు సపోర్ట్ చెయ్యరు ఒక్క అమ్మాయి తప్ప అంటూ రీతూని చూపిస్తాడు డీమాన్. ఆ తర్వాత పవన్ కి ఇచ్చిన టైమ్ అయిపోతుంది. పవన్ కి బయట అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అయిందని వాళ్ళ అమ్మ చెప్పగానే పవన్ సిగ్గుపడతాడు. ఇక అమ్మ సెంటిమెంట్ సాంగ్ వెయ్యడంతో హౌస్ అంత ఎమోషనల్ అవుతారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...