English | Telugu

నేను కొట్టేస్తే నిన్నెందుకు అడుగుతాడు.. ఒప్పుకున్న సీత!

బిగ్ బాస్ హౌస్ లో నిన్నటితో బిబి హోటల్ టాస్క్ ముగిసింది. ఇక హౌస్ లో మణికంఠ, నిఖిల్ కి స్టార్స్ వచ్చాయి. యష్మీకి గౌతమ్ స్టార్ ఇచ్చాడు. ఈ స్టార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదైన టాస్క్ లో ఈ స్టార్ తో కీలకమైన మార్పులు చేయొచ్చు.

నిన్న హౌస్ లో టాస్కు ముగిసిన వెంటనే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందో చెప్పమని బిగ్‌బాస్ అన్నాడు. అయితే బిబి హోటల్ టాస్కు మొదలయ్యే సమయంలో బిగ్‌బాస్ పంపిన డబ్బు నుంచి సీత కొంచెం డబ్బు కొట్టేసింది. ఇప్పుడు మొత్తం లెక్కపెట్టుకుంటే కొంచెం డబ్బు మిస్ అయినట్లు రాయల్ క్లాన్‌కి తెలిసింది. దీంతో అవినాష్, హరితేజ, మెహబూబ్, రోహిణి ఓజీ క్లాన్ దగ్గరికొచ్చి వీకెండ్ లో నాగార్జున సర్ ని మేమ్ అడుగుతాం.. ఎవరు తీసుకున్నారో చెప్పండి అనగానే.. నేనే కొట్టేశా అంటూ సీత ఒప్పుకుంది. కానీ డబ్బులు మాత్రం ఇవ్వనంటూ తెగేసి చెప్పింది.

దీంతో మెగా ఛీఫ్ నబీల్ న్యాయం చెప్పాడు. బజర్ మోగకముందు డబ్బులు తీసుకోవడం ఫెయిర్ కాదంటూ నబీల్ అన్నాడు. డబ్బులు తీసుకుంటే తప్పేంటి.. నా డబ్బుల గురించి మీరందరూ మాట్లాడతారేంటి అంటూ సీత ఫైర్ అయింది. నాగ్ సర్ వీకెండ్ లో నన్ను అడుగుతారు.. డబ్బులు కొట్టేస్తే నువ్వెందుకు అడగలేదంటాడని‌ నబీల్ అనగా.. నేను డబ్బులు తీస్తే నిన్నెందుకు అడుగుతాడంటూ సీత చెప్పింది. కాసేపటికి ఏమనుకుందో ఏమో కానీ డబ్బులు తీసుకెళ్లి హరితేజకి ఇచ్చేసింది. ఇలా ఈ గేమ్‌ ముగిసేసరికి ఓజీ క్లాన్ దగ్గర లక్ష 8 వేల 500 ఉండగా.. రాయల్ టీమ్ దగ్గర లక్ష 16వేల 500 ఉన్నాయి. దీంతో రాయల్ క్లాన్ గెలిచింది. ఇక వీళ్లు గెలిచారని చెప్పగానే రాయల్ క్లాన్ విజిల్స్, డ్యాన్సులతో తెగ హంగామా చేసింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...