English | Telugu

బిగ్ బాస్ తెలుగు రివ్యూ.. కంటెస్టెంట్స్ ఎవరెలా ఉన్నారంటే!

బిగ్ బాస్ ఆదిలోనే హంసపాదం అన్నట్లు ఆదివారం కంటెస్టెంట్స్ మొహాలు చూసే సగం మంది ప్రేక్షకులకు గుండె ఆగినంత పనైంది. ఇక గత నెల రోజుల నుండి ఏ పాన్ ఇండియా మూవీకి లేనంత హైప్ క్రియేట్ చేస్తూ వచ్చారు మన బిగ్ బాస్ పెద్దలు. కానీ కంటెస్టెంట్ ఎంపిక లో ఫెయిల్ అయ్యారన్న విషయం స్పష్టంగా కన్పిస్తుంది. ఇంట్లోకి పంపిర్రో లేదో గ్యాప్ ఇవ్వకుండా.. ఎవరికి వారే స్క్రీన్ స్పేస్ కోసం ఎగబట్టారు. ప్రతి సీజన్లో ఒక ఎమోషనల్ స్టార్ ఉన్నట్లే ఇప్పుడు కూడా మన పర్ స్పెక్టివ్ ఎమోషనల్ స్టార్ నాగ మణికంఠ ఉండనే ఉన్నాడు. ఇక రతికని తలపించే స్లాగ్ ల్యాగ్ లతో కెమెరాకి ఫోకస్ చేస్తూ మన RGV బ్యూటీ సోనియా తనదైన కమాండింగ్ తో దూసుకెళ్తుంది.

అంతో.. ఇంతో హౌస్ లో యాక్టీవ్ గా ఉందంటే నిఖిల్. యశ్మీ గౌడ అంటే మరో శోభాశెట్టిలా ఉంది. గౌతమ్ ఓమ్ హౌస్ లో మరొక పెద్దన్న అవుతాడనుకుంటే నిద్ర మత్తులో ఉన్నట్లు నాకేం సంబంధం లేదన్నట్లే ఉంటున్నాడు.. రాత్రి జరిగిన ఎపిసోడ్ లో జనాల నుండి సింపథీ గెయిన్ చెయ్యడానికి మణికంఠ చేస్తున్నాడనిపిస్తుంది. అయితే షోలో ఎక్కువ శాతం మణికంఠనే ఉన్నాడు. బెబక్క ఇప్పుడు శాంతమూర్తిలాగే రియాక్ట్ అవుతుంది. ఇక మునుముందు కరాటే కళ్యాని లాంటి వాళ్ళు పూనుకుంటారేమో చూడాలి. బేబక్క కిచెన్ లో ఉన్నంత వరకు సేఫ్ అని భావించినట్టుంది.

శేఖర్ బాషాని హ్యాండిల్ చెయ్యడం హౌస్ మేట్స్ కి కష్టమే. ఓవర్ యాక్టింగ్ కాకుండా ఓకే పర్లేదు అన్నట్లున్నాడు. కిర్రాక్ సీత నావంతు వచ్చినప్పుడు నేను మాట్లాడుతా.. నన్ను గెలికితే ఊరుకోను అన్నట్లు ఉంటుంది. అభయ్ ఇప్పటివరకు అందరి దృష్టిలో పాజిటివ్ గా ఉండడంతో ఒక్క నామినేషన్ కూడా పడలేదు. అలా ఉండడం అతని రియాలిటీనో ఫేకో చూడాలి మరి. పృథ్వీరాజ్, నబిల్ ఆఫ్రిదీలు ఇంకా ఓపెనప్ అవలేదు. వాళ్ళిద్దరు ఉన్నవాళ్ళతో కలవలేకపోతున్నారు‌. ఇక ఈసారి జబర్దస్త్ నుండి కమెడియన్ ని ఎవరిని తీసుకోలేదు. బహుశా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకుంటారేమో చూడాలి. హౌస్ లో కామెడీ కూడా ఉండాలి కదా అని విష్ణుప్రియని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆమె ఎంట్రీతో ఆ లోటు అయితే ప్రేక్షకులకు లేదు. ఇప్పటికే విష్ణుప్రియ బయట ట్రోల్స్ తో ట్రెండింగ్ లో ఉంటుంది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...