English | Telugu
Bigg boss 9 Telugu 14Th Week Captain Bharani : చివరి కెప్టెన్ గా భరణి.. ఇమ్మ్యూనిటీ తప్ప అన్ని ఉంటాయి!
Updated : Dec 9, 2025
బిగ్ బాస్ హౌస్ లో ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ లేదని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత హౌస్ లో టాస్క్ లు పెట్టి ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సాధిస్తారో వాళ్ళు నామినేషన్ నుండి సేవ్ అవుతారని బిగ్ బాస్ చెప్తాడు. అందులో భాగంగా స్వింగ్ జరా టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అందులో కళ్యాణ్ టికెట్ ఫినాలే విన్నర్ కాబట్టి తన గేమ్ ఆడడు.. కేవలం సంఛాలక్. ఇక సంజన జైల్లో ఉంది కాబట్టి ఈ టాస్క్ ఆడే ఛాన్స్ లేదని బిగ్ బాస్ చెప్తాడు.
ఇక ఈ టాస్క్ లో అయిదుగురు పాల్గొంటారు. టాస్క్ లో ముందుగా ఇమ్మాన్యుయేల్, ఆ తర్వాత డిమాన్ పవన్ ఆ తర్వాత భరణి, తనుజ, సుమన్ శెట్టి ఇలా అయిదగురు ఉంటారు. ఇందులో మొదట వచ్చిన వారి నుండి చివరికి వచ్చిన వారి వరకు పాయింట్స్ ఉంటాయి. ఇలా ఈ వారం జరిగే టాస్క్ లన్నింటిలో ఎవరు ఎక్కువ పాయింట్స్ తో ఉంటారో వాళ్ళే నామినేషన్ నుండి సేవ్ అవుతారు. ఇప్పటికే ఇమ్మాన్యుయేల్ మనీ పాయింట్స్ టాస్క్ లో ఎక్కువ పాయింట్స్ ముందంజలో ఉన్నాడు.
ఇక ఈ స్వీంగ్ జరా టాస్క్ లో కూడా ముందంజలో ఉన్నాడు ఇమ్మాన్యుయేల్. హౌస్ లో ఉన్న ఏడుగురిలో ఒక్క భరణి తప్ప అందరు కెప్టెన్ అయిన విషయం తెలిసిందే అయితే బిగ్ బాస్ భరణి ని డైరెక్ట్ కెప్టెన్ చేస్తాడు కానీ ఇమ్మ్యూనిటి ఉండదు.. కెప్టెన్ కి ఉండే అన్ని ఫెసిలిటిస్, అర్హతలు ఉంటాయని బిగ్ బాస్ చెప్పగానే భరణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.