English | Telugu

Bigg Boss 8 Telugu: నిఖిల్ టీమ్ నుండి బేబక్క అవుట్.. కారణం ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్ మొదలై వారం అయ్యింది. ఇక ఒక్కో రోజు కంటెస్టెంట్స్ ఏం చేశారో నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో చెప్పుకొచ్చాడు. మొదటగా హౌస్ లోని కంటెస్టెంట్స్ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాడు. ఆ తర్వాత మగ్గురు చీఫ్‌లకి కంగ్రాట్స్ చెప్పి యష్మీకి మాత్రం స్పెషల్ కంగ్రాట్స్ అని నాగార్జున అన్నారు. ఆ తర్వాత ఎప్పటిలా కాకుండా ఈ సీజన్‌లో నాకంటే ముందే శనివారం మీ జడ్జిమెంట్ ఉంటుందంటూ మీకు నచ్చని కంటెస్టెంట్‌కి కత్తి గుచ్చి రీజన్ చెప్పాలని నాగార్జున అన్నాడు.

మొదటగా మణికంఠలో నెగెటివ్ ఎనర్జీ ఉందంటూ శేఖర్ బాషా పొడిచాడు. యష్మీకి నైనిక కత్తి గుచ్చుతూ ఆమె బిహేవియర్ బాలేదంటూ కంప్లెయింట్ ఇచ్చింది. కానీ విచిత్రంగా ఈ విషయంలో యష్మీకి నాగ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. యష్మీ టీమ్ గెలిచింది.. వాళ్ల చేతిలో పవర్ ఉంది..ఎలా కావాలంటే అలా వాడుకుంటారు.. అది తప్పా రైటా అనేది వేరే విషయం.. దీనికే ఇలా అయిపోతే ఎలా? ముందుముందు చాలా ఉంది ఇంకా అంటూ నాగ్ అన్నారు.

ఇక నెక్స్ట్ నినిఖిల్‌కి కత్తి గుచ్చుతూ బేబక్క చాలానే చెప్పింది. తనలో ఒకప్పుడు గొప్ప లీడర్‌ని చూశానని.. కానీ ఇప్పుడు అలా లేడంటూ చెప్పింది. ఇప్పుడు సోనియా సోనియా అంటూ తనకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.. మమ్మల్ని పట్టించుకోవట్లేదు.. అందుకే నాకు ఆయన టీమ్‌లో ఉండాలని లేదంటూ బేబక్క చెప్పింది. దీంతో బేబక్కను నిఖిల్ టీమ్ నుంచి తీసేశారు నాగ్. ఏ టీమ్‌లోకి వెళ్తారనేది బిగ్‌‍బాస్ చెబుతాడంటూ నాగ్ క్లారిటీ ఇచ్చారు. తర్వాత నిఖిల్‌కి కత్తి దింపుతూ మొదట్లో చూసినట్లు లేడంటూ అభయ్ చెప్పాడు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...