English | Telugu
జెండే..ఆర్య .. రాగసుధని పట్టుకుంటారా?
Updated : Jan 31, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. `బొమ్మరిల్లు` శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె జంటగా నటించారు. బెంగళూరు పద్మ, జ్యోతిరెడ్డి, జయలలిత, రామ్ జగన్ కీలక పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా ఆసక్తికరమలుపులతో సాగుతున్నీ సీరియల్ తాజాగా సరికొత్త ట్విస్ట్ లతో సాగుతోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రతీకారం కోసం గత జన్మ తనని హత్య చేసిన వారిని అంతం చేయాలని తిరిగి జన్మించిన ఓ యుతి కథ నేపథ్యంలో అంటూ సాగుతున్న ఈ సీరియల్ థ్రిల్లర్ జోనర్ లో సాగుతూ ఆకట్టుకుంటోంది.
Also Read:హైపర్ ఆది.. అనసూయకు చెప్పిన ఆ టింగులేంటీ?
ఆర్య వర్ధన్, జెండేలాపై పగా ప్రతీకారాలతో రగిలిపోతున్న రాజనందని చెల్లులు రాగసుధ అతని ఆఫీస్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆఫీస్‌లోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారని సీసీ టీవీ లో చూసినన జెండే ఆ గది వైపులగా అడుగులు వేస్తాడు. చివరికి రాగసుధ వున్న గది తలుపులు తెరిచే సరికి డోర్ పక్కన రాగసుధ దాక్కుంటుంది. చేతిలో పడిలిపోయిన గాజు ముక్కని ఆయుధంగా పట్టుకుని జెండే తనని గమనిస్తే అతనిపై దాడి చేసేందుకు సిద్ధంగా వుంటుంది. అది గమనించని జెండే .. రాగసుధపై కాల్పులకు రెడీ అయిపోయి ట్రిగ్గర్ నొక్కే సమయానికి చాకచక్యంగా జెండే కాలికి గాయం చేసి రాగసుధ అక్కడి నుంచి పారిపోతుంది.
Also Read:రాజనందిని చెల్లెలు జెండేకి చిక్కబోతోందా?
ఊహించని పరిణామానికి కంగుతున్న జెండే షాక్ కు గురవుతాడు. ఇక అక్కడి నుంచి తనని వతుక్కుంటూ వెంటపడతాడు. విషయం ఆర్యవర్థన్‌కి తెలియడంతో తనని ఎట్టిపరిస్థితుల్లో వదలొద్దని జెండేకి చెబుతాడు. కట్ చేస్తే ఆఫీస్ లో కుంటుతూ జెండే కనపించడంతో తో మీరాలో అనుమానం మొదలవుతుంది. జెండేని ఎందుకు కుంటుతున్నారని అడిగినా తను సమాధానం చెప్పడు.. అనుమానం వచ్చి సీసీటీవి ఫుటేజీ చూస్తుంది. అందులో రాగసుధ కనిపించడంతో వెంటనే అనుకు ఫోన్ చేసి సీసీ ఫుటేజ్ రూమ్ దగ్గరికి రమ్మంటుంది. ఆ తరువాత ఏం జరిగింది? .. అను రాగ సుధని చూసిందా? .. అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సింతే.