English | Telugu
ఆర్యవర్థన్ ఉచ్చులో రాగసుధ చిక్కినట్టేనా?
Updated : Mar 10, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. గత కొన్ని వారాలుగా విజయవంతంగా ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. థ్రిల్లర్ జానర్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సీరియల్ ని రూపొందించారు. `బొమ్మరిల్లు` ఫేమ్ వెంకట్ శ్రీరామ్, వర్ష హెచ్.కె. ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్ జగన్, బెంగళూరు పద్మ, విశ్వమోహన్, జ్యోతిరెడ్డి, అనూషా సంతోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గత జన్మ ప్రతీకారం నేపథ్యంలో ఈ సీరియల్ ని నిర్మించారు.
తన నుంచి తప్పించుకున్న రాగసుధ కోసం ఆర్యవర్థన్ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఎమ్మెల్యే కబ్జా చేసిన పెద్దమ్మ తల్లిని అతని నుంచి విడిపించి మళ్లీ బస్తీ వాసులకు అప్పగించిన ఆర్య.. తిరిగి పాత ఇంటికి రావాలని, అక్కడే వుండాలని అను తండ్రి సుబ్బుకు షరతు విధిస్తాడు. ఆ మాట కోసం సుబ్బు తన భార్యతో కలిసి పాత ఇంటికి వచ్చేస్తాడు. తనతో కలిసి రాగసుధ కూడా అదే ఇంటికి వచ్చేస్తుంది. ఇక్కడే రాగసుధని లాక్ చేయాలని ప్లాన్ చేసిన ఆర్య వర్ధన్ .. అనుని తీసుకుని సుబ్బు ఇంటికి చేరుకుంటాడు.
అక్కడ వున్న రాగసుధని అను గమనిస్తుంది. తను ఆర్య కంటపడకుండా జాగ్రత్తపడుతుంది. అయినా చివరికి రాగసుధ చేతే ఆర్యవర్థన్ కి కాఫీ ఇప్పించే ప్రయత్నం చేస్తాడు సుబ్బు. రాగసుధ తన ఫేస్ కనిపించకుండా కొంగుతో కవర్ చేసుకున్నా ఆర్య పసిగట్టేస్తాడు. ఆర్య వర్థన్ బిగించిన ఉచ్చులో రాగసుధ చిక్కుకుందా? .. ఆర్య వర్థన్ కు రాగసుధ చిక్కకుండా అను ఏం చేసింది? ..ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. సుబ్బు ఇదంతా గమనించాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.